Mana ShankaraVaraprasad Garu Day1 Collection: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

Mana ShankaraVaraprasad Garu Day1  Collection: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?
x

Mana ShankaraVaraprasad Garu Day1 Collection: ‘మన శంకరవరప్రసాద్‌ గారు’.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే..?

Highlights

Mana ShankaraVaraprasad Garu Day1 Collection: ‘పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..’ అంటూ సంక్రాంతి బరిలోకి దిగి అభిమానులను అలరించారు మెగాస్టార్ చిరంజీవి.

Mana ShankaraVaraprasad Garu Day1 Collection: ‘పండగకు వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..’ అంటూ సంక్రాంతి బరిలోకి దిగి అభిమానులను అలరించారు మెగాస్టార్ చిరంజీవి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో, తొలి రోజు కలెక్షన్లపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తాజాగా ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్లను నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్స్‌తో కలిపి మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.84 కోట్లు గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు షైన్ స్క్రీన్స్ వెల్లడించింది. ‘మన శంకరవరప్రసాద్ గారు బాక్సాఫీస్‌ను షేక్ చేసింది’ అంటూ ప్రత్యేక పోస్టర్‌ను కూడా విడుదల చేసింది.

ఈ చిత్రంలో చిరంజీవి సరసన నయనతార నటించగా, వెంకటేశ్ అతిథి పాత్రలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే అంశాలతో పాటు భావోద్వేగాలు, వినోదం మేళవించి ఈ సినిమాను తెరకెక్కించినట్లు సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

కథాంశం:

శంకరవరప్రసాద్‌ (చిరంజీవి) ఒక నేషనల్ సెక్యూరిటీ ఆఫీసర్. కేంద్రమంత్రి శర్మ (శరత్ సక్సేనా)కు భద్రత బాధ్యతలు నిర్వహిస్తుంటాడు. మంత్రి, శంకరవరప్రసాద్‌ను తన కుటుంబ సభ్యుడిలా భావిస్తాడు. అయితే శంకరవరప్రసాద్ భార్య శశిరేఖ (నయనతార) నుంచి విడిపోయిన విషయం తెలుసుకున్న మంత్రి, అతని పిల్లలతో కలిసి సమయం గడిపేలా ఏర్పాట్లు చేస్తాడు.

ఓ బోర్డింగ్ స్కూల్‌లో పీఈటీగా చేరిన శంకరవరప్రసాద్, తన పిల్లలకు దగ్గరయ్యాడా? అసలు భార్యతో ఎందుకు విడిపోయాడు? వారి ప్రేమ కథ ఏంటి? తండ్రి ప్రేమకు దూరంగా పెరిగిన పిల్లలకు నిజం ఎప్పుడు తెలిసింది? కర్ణాటకకు చెందిన మైనింగ్ వ్యాపారి వెంకీ గౌడ (వెంకటేశ్)కి, శశిరేఖకు ఉన్న సంబంధం ఏమిటి? విడిపోయిన భార్యాభర్తలు మళ్లీ కలుసుకున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలే ఈ సినిమా కథాంశం.

మొత్తంగా, సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో ‘మన శంకరవరప్రసాద్‌ గారు’ ఘనంగా స్టార్ట్ తీసిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories