
Manchu Lakshmi: స్టార్ హోటల్లో మంచు లక్ష్మికి చేదు అనుభవం
Manchu Lakshmi: టాలీవుడ్ యాక్ట్రెస్, పాపులర్ హోస్ట్ మంచు లక్ష్మికి చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది.
Manchu Lakshmi: టాలీవుడ్ యాక్ట్రెస్, పాపులర్ హోస్ట్ మంచు లక్ష్మికి చెన్నైలోని ఓ ప్రముఖ హోటల్లో చేదు అనుభవం ఎదురైంది. సోషల్ మీడియా వేదికగా ఆమె తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్లో బస చేసిన మంచు లక్ష్మి, అక్కడ యాజమాన్యం ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వృత్తిపరమైన పనుల నిమిత్తం తన వెంట వచ్చిన కెమెరామెన్‌ను హోటల్ గదిలోకి అనుమతించకపోవడమే ఈ వివాదానికి కారణం.
నేను ప్రపంచమంతా తిరిగాను, కానీ కెమెరాలను గదిలోకి అనుమతించం అనే వింత రూల్‌ను ఎక్కడా చూడలేదు అని ఆమె మండిపడ్డారు.హోటల్ మేనేజర్ మరియు సిబ్బంది ప్రవర్తన చాలా అగౌరవంగా ఉందని, తాను అడిగిన ప్రశ్నలకు కనీసం సమాధానం కూడా ఇవ్వలేదని ఆమె పేర్కొన్నారు.
కెమెరాలకు అనుమతి లేదనే విషయాన్ని ఎక్కడా నోటీసు బోర్డుల్లో గానీ, బుకింగ్ సమయంలో గానీ తెలపలేదని ఆమె ధ్వజమెత్తారు.గతంలో తన స్టైలిస్ట్ అదే హోటల్లో తీసుకున్న ఫోటోలను చూపించిన తర్వాతే తనను అనుమతించారని, సెలబ్రిటీల పట్ల ఇలాంటి వైఖరి సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.
గ్రీన్ పార్క్ హోటల్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. కానీ అతిథులను గౌరవించే విధానం ఇది కాదు. యాజమాన్యం దీనిపై స్పందించి, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని మంచు లక్ష్మి చెప్పుకొచ్చారు. మొత్తానికి, ఒక సెలబ్రిటీ హోటల్ మేనేజ్మెంట్ను ఇలా బహిరంగంగా ప్రశ్నించడం చర్చనీయాంశమైంది. రూల్స్ పేరుతో అతిథులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




