Kannappa postponed: కన్నప్ప మూవీ విడుదల వాయిదా..క్షమాపణలు చెప్పిన మంచు విష్ణు

Kannappa postponed: కన్నప్ప మూవీ విడుదల వాయిదా..క్షమాపణలు చెప్పిన మంచు విష్ణు
x
Highlights

Kannappa postponed: మంచు విష్ణు కీలక పాత్రలో రూపొందించిన కన్నప్ప మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా విష్ణు పోస్ట్...

Kannappa postponed: మంచు విష్ణు కీలక పాత్రలో రూపొందించిన కన్నప్ప మూవీ విడుదల వాయిదా పడింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఎక్స్ వేదికగా విష్ణు పోస్ట్ చేశారు. వీఎఫ్ఎక్స్ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో మూవీ విడుదల వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఈ ప్రకటన చేసినందుకు అభిమానులకు క్షమాపణలు చెప్పారు. మొదట అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న మూవీ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

కన్నప్ప జీవిత ప్రయాణం చాలా అద్భుతమైంది. అత్యున్నత ప్రమాణాలకు కలిగిన సినిమాటిక్ అనుభూతితో దాన్ని అందించడానికి మేము క్రుత నిశ్చయంతో ఉన్నాము. అందుకు మరికొన్ని వారాల సమయం అవసరం. కీలక ఎపిసోడ్స్ కు సంబంధించి వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో సినిమా విడుదల కాస్త ఆలస్యం కానుంది. సినిమా కోసం మీరెంత నిరీక్షిస్తున్నారో అర్థం చేసుకోగలనుప. ఆలస్యమవుతున్నందుకు విచారం వ్యక్తం చేస్తున్నాం. మీ సహనానికి, సహకారానికి ధన్యవాదాలు అంటూ విష్ణు పోస్టు చేశారు.



Show Full Article
Print Article
Next Story
More Stories