Meera Chopra : ప్రాణాలు అరచేతిలో.. పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు చేదు అనుభవం..!

Meera Chopra : ప్రాణాలు అరచేతిలో.. పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు చేదు అనుభవం..!
x

Meera Chopra : ప్రాణాలు అరచేతిలో.. పవన్ కల్యాణ్ హీరోయిన్‌కు చేదు అనుభవం..!

Highlights

Meera Chopra : విదేశీ పర్యటనలో ప్రమాదం తప్పిన మీరా చోప్రా.. షాకింగ్ ఘటన వివరాలు బయటకు!

Meera Chopra : గ్లామర్ ప్రపంచంలో మెరిసే తారలకు బయటి ప్రపంచంలో అడుగుపెడితే ఎదురయ్యే సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. తాజాగా హీరోయిన్ మీరా చోప్రాకు ఎదురైన ఒక అనుభవం వింటే ఎవరికైనా ఒళ్లు గగుర్పొడవాల్సిందే. క్షేమంగా గమ్యం చేరుస్తారని నమ్మి క్యాబ్ ఎక్కిన ఆమెకు, ఆ ప్రయాణం ఒక పీడకలలా మారిపోయింది.

మీరా చోప్రా తన వ్యక్తిగత అవసరాల కోసం ఆరు గంటల ప్యాకేజీతో ఒక ఉబర్ క్యాబ్‌ను బుక్ చేసుకున్నారు. అయితే కారు దగ్గరికి రాగానే ఆమెకు మొదటి షాక్ తగిలింది. ఆ కారు నిండా దుమ్ము, మురికి పట్టేసి అపరిశుభ్రంగా ఉంది. సరే, అత్యవసరం కదా అని సర్దుకుందామనుకుంటే.. డ్రైవర్ ప్రవర్తన ఆమెను మరింత ఆందోళనకు గురిచేసింది.

కారు మాత్రమే కాదు, డ్రైవర్ కూడా చాలా డర్టీగా ఉన్నాడని మీరా పేర్కొన్నారు. కారు ఎందుకింత మురికిగా ఉందని అడిగితే డ్రైవర్ నుంచి సమాధానం లేదు. దానికి కారణం.. అతను కారు నడుపుతూనే నిద్రపోతున్నాడు. డ్రైవర్ నిద్రమత్తులో ఉండటంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక మీరా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వచ్చింది.

పరిస్థితి తీవ్రతను గమనించిన మీరా.. కేవలం 20 నిమిషాల్లోనే ఆ క్యాబ్ దిగిపోయి సురక్షితంగా మరో వాహనాన్ని ఆశ్రయించారు. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. 20 నిమిషాల ప్రయాణానికే ఉబర్ సంస్థ ఆమె నుంచి ఏకంగా 6 గంటల పూర్తి ఫీజును వసూలు చేసింది. కస్టమర్ల భద్రతను గాలికి వదిలేసి, కేవలం డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా ఉబర్ పనిచేస్తోంది. ఇదెంత అసహ్యకరం అంటూ ఆమె ట్విట్టర్ (X) వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కారు.

ఈ ఘటనపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. పెద్ద పెద్ద సంస్థలు కనీసం డ్రైవర్ల ఆరోగ్యం, నిద్ర గురించి పట్టించుకోవా? అని కొందరు ప్రశ్నిస్తుంటే, డబ్బులు తీసుకోవడంలో ఉన్న వేగం.. భద్రత కల్పించడంలో ఎందుకు లేదు?" అని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరా చోప్రా చేసిన ఈ ధైర్యవంతమైన పోస్ట్ ఇప్పుడు క్యాబ్ సర్వీసుల నాణ్యతపై పెద్ద చర్చకే దారితీసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories