Tollywood: ఒకప్పుడు సౌత్ ఇండియా హీరోయిన్.. ఇప్పుడు ఫేమస్ లాయర్..!

Tollywood: ఒకప్పుడు సౌత్ ఇండియా హీరోయిన్.. ఇప్పుడు ఫేమస్ లాయర్..!
x
Highlights

Tollywood: మెల్లగ మెల్లగ తట్టి.. మేలుకొ మేలుకొ మంటు... అనే పాటలో కుర్రకారుని తమవైపుకు తిప్పుకున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ మీకు గుర్తుందా?

Tollywood: మెల్లగ మెల్లగ తట్టి.. మేలుకొ మేలుకొ మంటు... అనే పాటలో కుర్రకారుని తమవైపుకు తిప్పుకున్న సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ మీకు గుర్తుందా? అచ్చమైన తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ బెంగాలీ భామ ఎన్నో సౌత్ సినిమాల్లో నటించింది. అయితే ఇప్పుడు ఆమె సినిమాలు మానేసి.. లాయర్‌‌ వృత్తిని ఎంచుకుంది. వివరాలు చూద్దాం..

దక్షిణాది సినిమాలో ఆమె తక్కువ సమయమే ఉంది. కానీ ఉన్న సమయంలోనే ఏకంగా సౌత్ ఇండియాని కొన్నాళ్ల పాటు ఏలింది. కన్నడ, తమిళ, బెంగాలీ, మళయాళం సినిమాల్లో ఎక్కువగా నటించిన ఆమె ఎవరో కాదు.. సువలక్ష్మి. సువలక్ష్మి తెలుగు వాళ్లకూ బాగా పరిచయమే. ఆశ ఆశ ఆశ సినమాతో పాటు పలు తెలుగులో డబ్బింగ్ చేసిన సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ముఖ్యంగా ఆమె గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉంటూ అందం, అభినయంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకుంది.

సువలక్మింత కాలేజీలో చదువుతున్నప్పడు ఆమెను సత్యజిత్ రే చూశారు. వెంటనే సినిమాలో అవకాశం ఇచ్చారు. అయితే అప్పటికి ఆమె సోదరుడు చనిపోవడంతో చాలా బాధల్లో ఉంది. అయినా ఆమెను సత్యజిత్ రే ఒప్పించి అజిత్ చిత్రం ఆసై లో ఛాన్స్ ఇచ్చారు. ఇందులో యమున పాత్రలో సువలక్మిా అద్బుతంగా నటించారు. మొదటి సినిమాతోనే ప్రసంశలు అందుకుంది.

ఒక వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు ఆమె లా విద్యను అభ్యసించింది. ఆసై సినిమా తర్వాత తమిళ ఇండస్ట్రీలో ఆమెకు చాలా సినిమాలు వచ్చాయి. అవన్నీ చేసుకుంటూ మంచి హీరోయిన్ అనే పేరు తెచ్చుకుంది. చీరకట్టులో ఎంతో సాంప్రదాయం అచ్చం తెలుగు అమ్మాయిలా కనిపించే సువలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆశ ఆశ ఆశ సినిమాల్లో మెల్లగ మెల్గగ తట్టి.. అనేపాట అప్పట్లో చాలా ఫేమస్. కొన్ని డబ్బింగ్ చేసిన సినిమాలు తెలుగు వచ్చాయి. కొంతకాలం తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు బెనర్జీని పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ప్రస్తుతం ఆమె తన భర్త వ్యాపారాన్ని చూసుకుంటూ.. న్యాయవాదిగా పనిచేస్తుంది. కొన్ని పాపులర్ కేసులు తీసుకుని పాపులర్ లాయర్ అయింది.



Show Full Article
Print Article
Next Story
More Stories