
Mega Blockbuster: మెగా విధ్వంసం.. 'ఓజీ' రికార్డులను బ్రేక్ చేసిన 'మన శంకర వరప్రసాద్ గారూ'
Mega Blockbuster: సంక్రాంతి పండగ అంటేనే వినోదం.. ఆ వినోదానికి మెగాస్టార్ గ్రేస్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే! సరిగ్గా ఇదే జరిగింది ‘మన శంకర వరప్రసాద్ గారూ’ విషయంలో.
సంక్రాంతి పండగ అంటేనే వినోదం.. ఆ వినోదానికి మెగాస్టార్ గ్రేస్ తోడైతే బాక్సాఫీస్ దగ్గర పూనకాలే! సరిగ్గా ఇదే జరిగింది ‘మన శంకర వరప్రసాద్ గారూ’ విషయంలో. దర్శకుడు అనీల్ రావిపూడి, మెగాస్టార్ చిరంజీవిలోని వింటేజ్ కామెడీ టైమింగ్‌ను వందకు వంద శాతం వాడుకుని, ప్రేక్షకులకు సంక్రాంతి ముందే ఫుల్ మీల్స్ వడ్డించారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి అభిమానులు గత కొన్నేళ్లుగా ఏం ఆశిస్తున్నారో, అనీల్ రావిపూడి అది కచ్చితంగా క్యాచ్ చేశారు. కొత్త కథ కాకపోయినా, కథనం ఆహా ఓహో అనిపించకపోయినా.. ఆ 'ట్రీట్మెంట్' మాత్రం నభూతో నభవిష్యతి.
రెండున్నర గంటల పాటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్లకు పరుగులు పెట్టించారు. పోటీగా ఎన్ని సినిమాలు వచ్చినా, నాకు నేనే పోటీ.. నాతో నాకే పోటీ అన్నట్టుగా మెగాస్టార్ బాక్సాఫీస్ దగ్గర తన హవా కొనసాగిస్తున్నారు. నెగెటివ్ కామెంట్స్ చేసేవాళ్లు, ట్రోల్స్ చేసేవాళ్లు ఉన్నా.. ఆ బురదే ఇప్పుడు కోట్లు కురిపిస్తూ కనకవర్షంలా మారుతోంది. తాజాగా ఈ సినిమా పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా కలెక్షన్లు దాటేసినట్టు మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా కథ అంతా NIA ఆఫీసర్ శంకర వరప్రసాద్ చుట్టూ తిరుగుతుంది.
శశిరేఖ ఎంగేజ్మెంట్కు వెళ్లి, మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు వరప్రసాద్. అనుకోని కారణాల వల్ల ఆమె ఎంగేజ్మెంట్ బ్రేక్ అవ్వడం, ఆ తర్వాత పరిచయాలు పెరగడం.. చివరికి యూనివర్స్ తమను కలపాలని కోరుకుంటుందని భావించి ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కోట్లు ఆస్తి ఉన్నా, తండ్రిని కాదని సాధారణ జీవితం గడపడానికి వరప్రసాద్ ఇంటికి వచ్చేస్తుంది శశిరేఖ. అయితే, మొదటి నుంచీ అల్లుడంటే గిట్టని మామగారు వీరిద్దరినీ విడగొట్టడానికి స్కెచ్ వేస్తాడు. అల్లుడిని తన ఇంటికి పిలిపించుకుని, మొదట గౌరవించి.. ఆ తర్వాత ఇంటి పనుల వాడిగా మార్చేస్తాడు.
పిల్లలను దూరం చేయడం, భార్యాభర్తల మధ్య మనస్పర్థలు సృష్టించడంతో కథ సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. తీవ్రమైన గొడవలు, విడాకుల వరకు వెళ్లిన వీరి బంధం మళ్లీ ఎలా ఒక్కటియ్యింది? దెబ్బతిన్న తన వైవాహిక జీవితాన్ని శంకర వరప్రసాద్ ఎలా సరిదిద్దుకున్నాడు? అనేదే సినిమా క్లైమాక్స్. థియేటర్లలో రికార్డులు సృష్టిస్తున్న ఈ మెగా హిట్ సినిమా.. మరో నాలుగు రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతోంది. సంక్రాంతి సందడిని మిస్ అయిన వారు లేదా మళ్లీ మళ్లీ చూడాలనుకునే వారు డిజిటల్ స్క్రీన్‌పై బాస్ విన్యాసాలను ఎంజాయ్ చేయవచ్చు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




