మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న మెగాస్టార్

Megastar Chiranjeevi: మెగాస్టార్ సినిమాలో మరొక స్టార్ హీరో

admin1
Updated on: 23 April 2022 1:43 PM IST
Megastar Chiranjeevi is Going To Make A Multistarrer Movie With Venky kudumula
X

మల్టీస్టారర్ సినిమా చేయబోతున్న మెగాస్టార్

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అభిమానులు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అయితే మరో వైపు మెగాస్టార్ గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కేస్ రవీంద్ర అలియాస్ బాబీ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా తెరకెక్కనున్న సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి.

మరోవైపు వెంకీ కుడుముల డైరెక్షన్ లో కూడా మెగాస్టార్ ఒక సినిమా చేసేందుకు సైన్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ పనులు కూడా ఇప్పటికే పూర్తి అయిపోయాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఈ సినిమాలో బాగానే ఉండేటట్లు తెలుస్తుంది.

అయితే ఈ సినిమా గురించి మరో ఆసక్తికరమైన అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఒక మల్టీ స్టారర్ సినిమా అని మెగాస్టార్ తో పాటు మరొక స్టార్ హీరో కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

admin1

admin1

Next Story