Michael : మైఖేల్ జాక్సన్ బయోపిక్.. సంచలనం క్రియేట్ చేస్తున్న మూన్‌వాక్ మాంత్రికుడి టీజర్

Michael : మైఖేల్ జాక్సన్  బయోపిక్.. సంచలనం క్రియేట్ చేస్తున్న మూన్‌వాక్ మాంత్రికుడి టీజర్
x

Michael : మైఖేల్ జాక్సన్ బయోపిక్.. సంచలనం క్రియేట్ చేస్తున్న మూన్‌వాక్ మాంత్రికుడి టీజర్

Highlights

ప్రపంచాన్ని తన మూన్ వాక్ డ్యాన్స్‌తో మంత్రముగ్ధులను చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ మరణించి 16 సంవత్సరాలు దాటింది. 2009లో 50 ఏళ్ల వయసులోనే లాస్ ఏంజెల్స్‌లో ఆయన మరణించారు.

Michael : ప్రపంచాన్ని తన మూన్ వాక్ డ్యాన్స్‌తో మంత్రముగ్ధులను చేసిన పాప్ దిగ్గజం మైఖేల్ జాక్సన్ మరణించి 16 సంవత్సరాలు దాటింది. 2009లో 50 ఏళ్ల వయసులోనే లాస్ ఏంజెల్స్‌లో ఆయన మరణించారు. ఆయన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న మైఖేల్ అనే బయోపిక్ ఇప్పుడు ప్రేక్షకులలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా టీజర్, విడుదలైన అతి తక్కువ సమయంలోనే 10 కోట్లకు పైగా వ్యూస్ సాధించి సంచలనం సృష్టించింది. 2026లో విడుదల కానున్న ఈ సినిమా విశేషాలు, టీజర్ ఎలా ఉందో తెలుసుకుందాం.

మైఖేల్ జాక్సన్ అమెరికాలో జన్మించి, తన అసాధారణమైన డ్యాన్స్ స్టెప్పులు, పాటలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. ఆయన వేసే డ్యాన్స్ స్టెప్పులను కాపీ చేయడం ఎవరికీ అంత సులభం కాదు. ఆయన వేసిన స్టెప్పులు అంత ప్రత్యేకంగా ఉండేవి. మైఖేల్ కేవలం డ్యాన్సర్ మాత్రమే కాదు, గొప్ప సింగర్ కూడా. డ్యాన్స్ చేస్తూనే పాటలు పాడటం, అద్భుతమైన పాటలు రాయడం ఆయన ప్రత్యేకత.



చిన్న వయస్సులోనే తన సోదరులతో కలిసి జాక్సన్ బ్రదర్స్ అనే పేరుతో ఒక మ్యూజిక్ టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ టీమ్ బ్రేక్ డ్యాన్స్, పాప్ మ్యూజిక్ ద్వారా అపారమైన విజయాన్ని సాధించింది. మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా యూనివర్సల్ పిక్చర్స్ ఈ బయోపిక్‌ను నిర్మిస్తోంది. దీని టీజర్ ఇప్పటికే సంచలనం సృష్టించింది. ఈ చిత్రంలో మైఖేల్ జాక్సన్ పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ జాక్సన్ నటిస్తున్నారు. ఆయన మైఖేల్ లాగే కనిపించడం, ఆయన డ్యాన్స్ స్టెప్పులను పోలి ఉండటం సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఆంటోయిన్ ఫుక్వా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ఒక సాధారణ వ్యక్తి పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ గా ఎలా మారారు, ఆయన జీవితంలో ఎదురైన ఒడిదొడుకులు, అద్భుతమైన విజయ ప్రయాణాన్ని ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మైఖేల్ జాక్సన్ జీవితంలో అత్యంత వివాదాస్పదమైన, విషాదకరమైన అంశాలు కూడా ఉన్నాయి. మైఖేల్ జాక్సన్ రెండు వివాహాలు చేసుకున్నారు. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. 2009లో ఆయన అధిక మొత్తంలో నిద్ర మాత్రలు సేవించడం వల్ల మరణించారు. ఈ టాబ్లెట్‌ను ఆయనకు ఇచ్చిన డాక్టర్ ముర్రేకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. మైఖేల్ జీవితంలోని వివాదాలు, ఆయన మరణానికి సంబంధించిన వ్యక్తిగత అంశాలు సినిమాలో ఉంటాయా లేదా అనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఉత్కంఠ కలిగిస్తున్న ప్రశ్న.

Show Full Article
Print Article
Next Story
More Stories