Vrusshabha: భారీ డిజాస్టర్.. రూ. 70 కోట్ల బడ్జెట్.. వచ్చింది రూ.2 కోట్లు..!

Vrusshabha: భారీ డిజాస్టర్.. రూ. 70 కోట్ల బడ్జెట్.. వచ్చింది రూ.2 కోట్లు..!
x

Vrusshabha: భారీ డిజాస్టర్.. రూ. 70 కోట్ల బడ్జెట్.. వచ్చింది రూ.2 కోట్లు..! 

Highlights

Vrusshabha: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ (Vrusshabha) బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది.

Vrusshabha: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రలో, అత్యంత భారీ అంచనాల మధ్య విడుదలైన పాన్ ఇండియా చిత్రం ‘వృషభ’ (Vrusshabha) బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. 2025 చివరలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ చరిత్రలో ఒక భారీ డిజాస్టర్‌గా నిలిచినట్లు ట్రేడ్ వర్గాలు ధృవీకరించాయి.

వసూళ్ల పరంగా ఘోర పరాభవం

సుమారు రూ. 70 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం, ఐదు రోజులు గడిచినా కనీసం రూ. 1.94 కోట్లు కూడా దాటలేకపోయింది. మొదటి రోజు అన్ని భాషల్లో కలిపి కేవలం రూ. 60 లక్షల నుండి రూ. 1 కోటి మధ్యలో వసూళ్లు రాబట్టింది. మోహన్ లాల్ వంటి స్టార్ హీరో కెరీర్‌లో ఇవి అత్యంత తక్కువ ఓపెనింగ్స్ కావడం గమనార్హం. తెలుగులో ఈ సినిమా ప్రభావం ఏమాత్రం కనిపించలేదు. ఇక్కడ కేవలం రూ. 32 లక్షల వసూళ్లతోనే సరిపెట్టుకుంది.

సినిమా విఫలం కావడానికి ప్రధాన కారణాలు

పునర్జన్మల నేపథ్యంలో సాగే ఈ కథలో కొత్తదనం లేకపోవడం, దర్శకుడి కథనంలో స్పష్టత కొరవడటం ప్రేక్షకులను నిరాశపరిచింది. భారీ బడ్జెట్ సినిమా అని ప్రచారం చేసినప్పటికీ, తెరపై గ్రాఫిక్స్ అత్యంత నాసిరకంగా ఉండటంతో నెగటివ్ టాక్ పెరిగింది. మొదటి రోజు మొదటి షో నుంచే సోషల్ మీడియాలో నెగటివ్ రివ్యూలు రావడం సినిమా పతనానికి దారితీసింది. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 150 కోట్లు వసూలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం బడ్జెట్‌లో 10 శాతం కూడా రికవరీ అయ్యేలా లేదు.

సొంత రాష్ట్రం కేరళలో కూడా ఆదరణ లభించకపోవడంతో ఇప్పటికే చాలా థియేటర్ల నుంచి ఈ చిత్రాన్ని తొలగిస్తున్నారు. మొత్తానికి 2025లో భారతీయ సినీ పరిశ్రమలో 'వృషభ' అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories