Mrunal Thakur: నటి మృణాల్ ఠాకూర్ 'బ్రేకప్' సీక్రెట్: "నా యాక్టింగ్ నచ్చలేదు.. అందుకే వదిలేశాడు!"

Mrunal Thakur: నటి మృణాల్ ఠాకూర్ 'బ్రేకప్' సీక్రెట్: "నా యాక్టింగ్ నచ్చలేదు.. అందుకే వదిలేశాడు!"
Mrunal Thakur: టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.
Mrunal Thakur: టాలీవుడ్ సెన్సేషన్ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. తన అందం, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ భామ.. తాజాగా తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. తన మాజీ ప్రేమికుడు తనతో ఎందుకు విడిపోయాడో చెబుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
యాక్టింగ్ నచ్చకనే విడిపోయాడు: మృణాల్ నటించిన తాజా చిత్రం ‘దో దీవానే శహర్ మే’ ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పాత ప్రేమ బంధం గురించి ఆమె స్పందించారు. "నాకు దూకుడు ఎక్కువని, నాతో కలిసి ఉండలేనని అతను బ్రేకప్ చెప్పాడు. అంతేకాకుండా నేను యాక్టింగ్ చేయడం కూడా అతనికి నచ్చలేదు. అందుకే విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే దీనికి నేనేం బాధపడలేదు.. కానీ అతని మనస్తత్వం చూసి జాలిపడ్డాను" అని మృణాల్ బోల్డ్‌గా సమాధానమిచ్చారు.
పిల్లల భవిష్యత్తు కోసమే: అలాంటి సంకుచిత స్వభావం ఉన్న వ్యక్తులతో జీవితాన్ని పంచుకోవడం కష్టమని మృణాల్ అభిప్రాయపడ్డారు. "అలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తులతో ఉంటే.. భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు కూడా అదే భావజాలంతో పెరుగుతారు. అది నాకు ఇష్టం లేదు. అందుకే ఆ బంధం ముగిసిపోయినందుకు నేను హ్యాపీగానే ఉన్నాను" అని ఆమె స్పష్టం చేశారు.
ధనుష్, శ్రేయస్ అయ్యర్‌లతో లింక్-అప్ వార్తలపై క్లారిటీ: గత కొన్నాళ్లుగా మృణాల్ పేరు కోలీవుడ్ స్టార్ ధనుష్‌తోనూ, అటు టీమ్ ఇండియా క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌తోనూ వినిపిస్తోంది. ఈ రూమర్లపై మృణాల్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. "ధనుష్ నాకు మంచి స్నేహితుడు మాత్రమే. ఇక శ్రేయస్ అయ్యర్‌తో డేటింగ్ వార్తలన్నీ హాస్యాస్పదంగా ఉన్నాయి. ఇవన్నీ కేవలం ఫ్రీ పీఆర్ స్టంట్స్. ఇలాంటి వార్తలు చూసినప్పుడు నాకు నవ్వు వస్తుంది" అంటూ పుకార్లకు చెక్ పెట్టారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



