
Mrunal Thakur: ఆ హీరో వల్ల ..నా లవర్ నాకు గుడ్ బై చెప్పేశాడు -మృణాల్ ఠాకూర్
Mrunal Thakur: టాలీవుడ్ 'సీతారామం' మృణాల్ ఠాకూర్ వెండితెరపై ఎంత సున్నితంగా కనిపిస్తారో, నిజ జీవితంలో అంతటి బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటారు.
Mrunal Thakur: టాలీవుడ్ 'సీతారామం' మృణాల్ ఠాకూర్ వెండితెరపై ఎంత సున్నితంగా కనిపిస్తారో, నిజ జీవితంలో అంతటి బోల్డ్ నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా రౌనాక్ రాజానీ నిర్వహించిన రిలేషన్షిప్ అడ్వైస్ అనే షోలో పాల్గొన్న మృణాల్, తన మాజీ ప్రియుడికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన, కాస్త వింతైన సంఘటనను పంచుకున్నారు. ప్రేమికుల మధ్య ఉండాల్సిన నమ్మకం కరువైతే అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో ఆమె వివరించారు.
మృణాల్ తన కెరీర్ ఆరంభంలో హృతిక్ రోషన్, షాహిద్ కపూర్ వంటి గ్రీక్ వీరుల్లాంటి హీరోలతో కలిసి నటించారు. అయితే, ఆ అందమైన హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆమె మాజీ ప్రియుడికి అస్సలు నచ్చేది కాదట. ఆ అసూయతో అతను తనను తాను ఆ హీరోలతో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. ఎలాగైనా వారిలా మారిపోవాలని కంకణం కట్టుకుని, పట్టుదలతో జిమ్‌లో చెమటోడ్చి ఏకంగా 15 నుంచి 17 కిలోల బరువు తగ్గాడట. కండలు పెంచి తన రూపురేఖలనే మార్చుకున్నాడు.
అతను ఎంత ప్రయత్నించినా, ఆ మార్పు కేవలం అసూయతో కూడినది కావడంతో అది ఎంతో కాలం నిలవలేదు. నేను అతనిని ఎప్పుడూ బరువు తగ్గమని అడగలేదు.. కండలు ఉన్నవాడినే ప్రేమించాలనుకోలేదు అని మృణాల్ స్పష్టం చేశారు. కొంతకాలం తర్వాత అతను విసుగు చెంది, జిమ్ మానేసి విపరీతంగా తినడం మొదలుపెట్టాడట. ఫలితంగా మళ్ళీ 20 కిలోల బరువు పెరిగి.. ఇలా హీరోలను అందుకోవడం నా వల్ల కాదు అని చేతులెత్తేశాడట.
రిలేషన్షిప్లో ఒకరిపై ఒకరికి నమ్మకం లేకపోతే అది ఎప్పటికీ నిలబడదు. భాగస్వామి ఎదుగుదలను చూసి గర్వపడాలే తప్ప, అసూయతో మనల్ని మనం మార్చుకోవాలని చూడకూడదు. ప్రస్తుతం మృణాల్ తన కొత్త చిత్రం 'డూ దీవానే సెహర్ మే' ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. విశేషమేమిటంటే, ఈ సినిమా కథాంశం కూడా సంబంధాల్లో ఉండే అసూయ, అనుమానాల చుట్టూనే తిరుగుతుంది. మృణాల్ పంచుకున్న ఈ నిజ జీవిత అనుభవం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




