Rajamouli: రాజమౌళిపై వరుస ఫిర్యాదులు?

Rajamouli: రాజమౌళిపై వరుస ఫిర్యాదులు?
x

Rajamouli: రాజమౌళిపై వరుస ఫిర్యాదులు?

Highlights

రాజమౌళి–మహేష్ బాబు సినిమా ఈవెంట్ ముగిసిన తర్వాత, ఆయనపై రాష్ట్రీయ వానర సేన ఒక ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. హనుమంతుడి గురించి రాజమౌళి చేసిన కొన్ని వ్యాఖ్యలు తమ మనోభావాలను దెబ్బతీశాయని వారు పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు.

అయితే, అదే వివాదం ఇంకా చర్చలో ఉండగానే, వానర సేన మరో రెండు ఫిర్యాదులకు సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించింది. వాటిలో మొదటిది ఈవెంట్‌లో మహేష్ బాబును నంది మీద వచ్చినట్లుగా చూపించడం. “నంది మీద శివుడు మాత్రమే రావాలి. మహేష్ బాబును ఆలా చూపించడం ఎలా సరైంది?” అంటూ వానర సేన అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఇక బాహుబలి రీ-రిలీజ్ అనంతరం విడుదలకు సిద్ధమైన ‘బాహుబలి థియేటర్నల్ వార్’ కామిక్ సిరీస్ ట్రైలర్‌లో మరో వివాదం కనిపించిందని వారు చెబుతున్నారు. అందులో బాహుబలి రాక్షసుల వైపు నిలబడి ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్లు చూపించడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

“మానవుడైన బాహుబలి ఇంద్రుడితో పోరాడడం ఎలా? దేవతలను అవమానిస్తున్నారా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.

ఈ పరిణామాల్లో భాగంగా, రాజమౌళిపై త్వరలో రెండు కొత్త ఫిర్యాదులు నమోదు చేయనున్నట్లు వానర సేన ప్రకటించింది. దీంతో ఇప్పటికే వివాదాలతో ఇబ్బంది పడుతున్న రాజమౌళికి సమస్యలు మరింత పెరిగినట్లే కనిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories