Naga Chaitanya: పీఆర్‌ టీం పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

Naga Chaitanya Comments On Pr Activity
x

పీఆర్‌ టీం పై నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్

Highlights

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువ కనిపిస్తోంది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుండటం చూస్తున్నాం.

Naga Chaitanya: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో మంచి కంటే చెడే ఎక్కువ కనిపిస్తోంది. ఎప్పుడూ ఎవరినో ఒకరిని టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతుండటం చూస్తున్నాం. మరీ ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో ఈ నెగిటివిటీ ఎక్కువగా కనిపిస్తోంది. తమ హీరోల సినిమాలను పొగుడుతూ మరో హీరో సినిమాలపై విమర్శలు చేస్తుండడం రొటీన్‌ అయిపోయింది. అయితే తాజాగా సినీ ఇండస్ట్రీలో పీఆర్ టీం పై హీరో నాగ చైతన్య షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాగ చైతన్య పీఆర్ గేమ్‌లోకి తాను ఆలస్యంగా వచ్చానన్నారు. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‌గా ఉండనని చెప్పారు. సినిమా కోసం వర్క్ చేశామా.. ఇంటికి వెళ్లామా.. మన జీవితం మనం చూసుకున్నామా అన్నట్టు ఉంటానన్నారు. తనకు ఎలాంటి రాజకీయాలు తెలియవన్నారు. గత రెండేళ్లుగా పీఆర్ అనేది ఎక్కువైందని ప్రతి నెలా సుమారు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టకపోతే నువ్వు సరైన దారిలో ఉన్నట్టు కాదు.. సినిమా రిలీజ్ అవుతుందంటే పీఆర్ టీం అవసరం అని ఆయన అన్నారు. సినిమా గురించి ప్రేక్షకులు మాట్లాడుకునేలా చేయాలి. అందులో తప్పులేదు. కానీ కొంతమంది కావాలని అనవసర ప్రచారాలు చేస్తారని తెలిపారు.

పక్కనోడిని తొక్కేయాలని చూస్తారు. అది ఎందుకు చేస్తారో అర్థం కాదు. పక్కనోళ్లను ఇబ్బంది పెట్టే బదులు.. ఆ సమయాన్ని మన ఎదుగుదల కోసం ఉపయోగించుకోవడం ఆ డబ్బుతో ప్రశాంతంగా ఇష్టమైన టూర్స్ కు వెళ్లొచ్చు కదా అని నాగ చైతన్య చెప్పారు.

ఇక ఇదే ఇంటర్వ్యూలో తన మాజీ భార్య సమంతతో విడిపోవడం గురించి కూడా మాట్లాడారు. విడాకులు అనేది రాత్రికి రాత్రి తీసుకున్న నిర్ణయం కాదు.. ఎన్నో రోజులు చర్చించుకున్న తర్వాతే తామిద్దర విడిపోవాలనుకున్నామని చెప్పారు. మా విడాకులు ఇతరులకు వినోదంలా అయిపోయింది. ఎన్నో గాసిప్స్, వార్తలు వచ్చాయి. తనపై నెగిటివ్ కామెంట్స్ చేసేవారు ఇకనైనా ఆపేయండి.. మీ భవిష్యత్ గురించి మంచిగా ఆలోచించుకోవాలని సూచించారు నాగ చైతన్య.

ఇదిలా ఉంటే నాగచైతన్య రీసెంట్‌గా తండేల్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన తండేల్ సినిమా ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలలో నాగ చైతన్యకు జోడీగా సాయి పల్లవి నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిజ జీవిత సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో నాగ చైతన్య మత్స్యకారుడిలా కనిపించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories