Wild Dog Movie: 'వైల్డ్ డాగ్' మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే?

‍‍Nagarjuna Wild Dog Movie Review
x

వైల్డ్ డాగ్:(ఫొటోస్ ది హన్స్ ఇండియా)

Highlights

Wild Dog Movie Review: 'వైల్డ్ డాగ్' మూవీ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది.

Wild Dog Movie Review: వరుసగా పరాజయాలను ఎదుర్కొంటోన్న కింగ్ నాగార్జన ఈ సారి ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో 'వైల్డ్ డాగ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్‌ ​ సినిమాపై పాజిటీవ్‌ టాక్ ను క్రియేట్‌ చేశాయి. నూతన దర్శకుడు అహిషోర్‌ సాల్మన్ తెరకెక్కించిన ఈ సినిమాపై ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం(ఏప్రిల్‌ 02)విడుదలైన ఈ సినిమా నాగార్జునను హిట్‌ ట్రాక్‌ ఎక్కించిందా? కింగ్‌ నాగార్జున మరో ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏ మేరకు స్పందించారో చూద్దాం.

కథ

విజయ్‌ వర్మ(నాగార్జున అక్కినేని) ఒక నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) అధికారి. సంఘ విద్రోహ శక్తులతో పాటు తీవ్రవాదులను పట్టుకోవడం అతని పని. అయితే ఆయన మాత్రం ఉగ్రవాదులను అరెస్ట్‌ చేయడం కంటే హతం చేయడమే ఉత్తమని భావిస్తాడు. అందుకే డిపార్ట్‌మెంట్‌లో ఆయన్ని అంతా 'వైల్డ్‌డాగ్‌' అని పిలుస్తుంటారు. అలా అనేమంది తీవ్రవాదులను ఎన్‌కౌంటర్‌ చేసి సస్పెండ్‌ అవుతాడు. ఇదిలా ఉంటే పుణెలోని జాన్స్‌ బేకరిలో బాంబు బ్లాస్ట్‌ జరుగుతుంది. ఈ కేసును కేంద్ర హోంశాఖ సీరియస్‌గా తీసుకుంటుంది. కేసును త్వరగా చేధించాలని భావించిన డీఐజీ మోహన్‌ (అతుల్‌ కులకర్ణి).. సస్పెండ్‌ అయిన ఎన్‌ఐఏ అధికారిని తిరిగి విధుల్లోకి చేరాలని కోరతాడు. చివరకు విజయ్ వర్మ పెట్టిన కండీషన్‌కు ఎన్ఐఏ అధికారులు ఒప్పుకోవడంతో కేసును టెకప్‌ చేస్తాడు. విజయ్‌వర్మ తన టీమ్‌ కలిసి బాంబు బ్లాస్ట్‌ కేసును దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో ఈ బ్లాస్ట్‌ను ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన ఖాలిత్‌ చేశాడని కనిపెడతారు.

ఎవరేలా చేశారంటే

నాగార్జున తన సినీ కెరియర్ లో 'వైల్డ్‌డాగ్‌' మూవీ ఓ ప్రయోగమనే చెప్పాలి. దేశభక్తి గల ఎన్‌ఐఏ అధికారి విజయ్‌ వర్మ పాత్రలో ఒదిగిపోయాడు కింగ్‌ నాగార్జున. పోరాట ఘట్టాలను కూడా అవలీలగా చేశాడు. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్‌ సీన్‌లో నాగ్‌ అదరగొట్టాడు. రా ఏజెంట్‌ ఆర్యాపండిత్‌ పాత్రలో సయామీ ఖేర్‌ జీవించేసింది. ఛేజింగ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌లో నాగార్జునతో పోటీపడి మరీ ఇరగదీసింది. విజయ్‌ వర్మ టీమ్‌ సభ్యుడిగా బిగ్‌బాస్‌ ఫేమ్‌ అలీరెజా ఒదిగిపోయాడు. నిడివి ఎక్కువగా ఉన్న పాత్ర తనది. విజయ్‌ వర్మ భార్య ప్రియగా దియా మిర్జా పర్వాలేదనిపించింది. నిడివి చాలా తక్కువైనప్పటికీ ఉన్నంతలో బాగా నటించింది.

హైదరాబాద్‌లోని గోకుల్ చాట్ వద్ద బాంబు పేళ్లుళ్లు జరిగిన విషయం తెలిసిందే. ఆ నిజ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమే 'వైల్డ్ డాగ్'. ఇలాంటి కథను అందరికి నచ్చేలా చెప్పడం చాలా కష్టమైన పని. ఎటువంటి కమర్షియల్‌ హంగులు లేకుండా ఓ సిరియస్‌ స్టోరీని తెరపై చూపించి మెప్పించడంలో కొంతవరకు సఫలం అయ్యాడు దర్శకుడు అహిషోర్‌ సాల్మన్‌. ఉగ్రవాదిని పట్టుకునేందుకు హీరో తన టీమ్‌తో ఏం చేశాడనే ఒకే ఒక పాయింట్‌ చుట్టూ కథని తిప్పాడు. కథను పక్కదారి పట్టించకుండా కాన్సెప్ట్‌పై ఫోకస్‌ పెడుతూ సినిమా నడించాడు.

ఫస్టాప్‌ ఎక్కువగా ఎమోషనల్‌ కంటెంట్‌కు చోటు ఇచ్చిన దర్శకుడు.. సెకండాఫ్‌ మాత్రం ఎక్కువగా పోరాట ఘట్టాలపైనే దృష్టిపెట్టాడు. సెకండాఫ్‌ అంతా చాలా సీరియస్‌, ఆసక్తికరంగా సాగుతుంది. అయితే ఉగ్రవాదిని పట్టుకునే క్రమంలో విజయ్‌ వర్మ చేసే కొన్ని విన్యాసాలు రొటీన్‌గా అనిపిస్తాయి. ఇక చివర్లో వచ్చే ట్విస్ట్లులు మాత్రం అందరిని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మరో ప్రధాన బలం తమన్‌ నేపథ్య సంగీతం. తమన్‌ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో కీలక సన్నివేశాలకు ప్రాణం పోశాడు. ఎడిటింగ్‌ పర్వాలేదు. సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలకు కత్తెరవేస్తే బాగుండనిపిస్తుంది. మొత్తానికి నాగార్జన చేసిన మరో కొత్త ప్రయోగాన్ని ఆయన అభిమానులు కచ్చితంగా చూడాల్సిందే.

గమనిక: ఇది పూర్తిగా సమీక్షకుడి అభిప్రాయం మాత్రమే.

Show Full Article
Print Article
Next Story
More Stories