Nani:ప్రొడ్యూసర్ గారూ.. చిరంజీవి అలా పిలిచేసరికి ఆశ్యర్యపోయా: నాని

Nani Funny Conversation About Chiranjeevi
x

ప్రొడ్యూసర్ గారూ.. చిరంజీవి అలా పిలిచేసరికి ఆశ్యర్యపోయా: నాని

Highlights

నాని నిర్మాత వ్యవహరించిన చిత్రం కోర్ట్. ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. కోర్ట్ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. చిరంజీవితో జరిగిన ఓ సరదా సంభాషణను పంచుకున్నారు.

Nani: హీరోగానే కాదు నిర్మాతగానూ తన టాలెంట్‌ నిరూపించుకుంటున్నారు నాని. హీరోగా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నిర్మాతగానూ సత్తా చాటాలనుకుంటున్నారు. నాని నిర్మాత వ్యవహరించిన చిత్రం కోర్ట్. ఈ సినిమా మార్చి 14న విడుదల కానుంది. కోర్ట్ సినిమా ప్రచారంలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని.. చిరంజీవితో జరిగిన ఓ సరదా సంభాషణను పంచుకున్నారు.

నాగచైతన్య పెళ్లిలో తాను కారు దిగి మండపంలోకి వెళ్తుంటే చిరంజీవి గారు ఎదురొచ్చారని.. ప్రొడ్యూసర్ గారు బాగున్నారా అని పలకరించారని అన్నారు. వెనక అశ్వినీదత్ లాంటి గొప్పవాళ్లు ఎవరైనా వస్తున్నారేమోనని చూశానన్నారు. కానీ ఎవరూ లేరని.. మిమ్మల్నే ప్రొడ్యూసర్ గారు అని చిరంజీవి తనకు హగ్ ఇచ్చారని చెప్పారు. చిరంజీవి తనను అలా పిలవడంతో ఆశ్చర్యపోయానన్నారు నాని.

ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రియదర్శి మాట్లాడుతూ చిరంజీవి కోర్ట్ పోస్టర్ చూసి తనను అభినందించారని చెప్పారు. నువ్వు సూట్ వేసుకున్న పోస్టర్ చూశాను చాలా బాగున్నావు. నాని నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కదా.. హిట్ అవుతుందిలే అని చిరంజీవి అన్న విషయాన్ని ప్రియదర్శి తెలిపాడు. చిరంజీవిగారు అంత కాన్ఫిడెంట్‌గా చెప్పడంతో తనకు సంతోషమేసిందన్నారు. ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం కోర్ట్. ఈ సినిమాకు రామ్ జగదీష్ దర్శకత్వ వహించారు. ఇది కోర్ట్ డ్రామా కథ. కథ మొత్తం ఫోక్సో చట్టం గురించే ఉంటుందట. చాలా తక్కువ టైంలో తక్కువ బడ్జెట్‌లో ఈ సినిమాను తీశారు.

ఇదిలా ఉంటే శ్రీకాంత్ ఓదెలని డైరెక్టర్‌గా పెట్టి చిరంజీవితో కూడా ఓ సినిమా నిర్మించబోతున్నాడు నాని. హీరోగా ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న నాని.. నిర్మాతగానూ తన టాలెంట్ నిరూపించుకుంటున్నారు. ఇక చిరంజీవి సినిమా సక్సెస్ అయితే నిర్మాతగానూ నానికి తిరుగు ఉండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories