Nani: జపాన్‌లో విడుదలకు సిద్ధమైన నాని మూవీ.. ఇంతకీ ఏంటా సినిమా

Nani: జపాన్‌లో విడుదలకు సిద్ధమైన నాని మూవీ.. ఇంతకీ ఏంటా సినిమా
x
Highlights

Nani: ఇండియన్‌ సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి.

Nani: ఇండియన్‌ సినిమా స్థాయి పెరిగిపోయింది. ప్రాంతీయ చిత్రాలు సైతం అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటున్నాయి. ఇంటర్నేషనల్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. ఈ జాబితాలో మొదట రజినీకాంత్ ఉండేవారు. రజనీ అలనాటి హిట్‌ మూవీస్‌ జపాన్‌లో విడుదలై ప్రేక్షకులను అలరటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఎన్టీఆర్‌, ప్రభాస్‌ ఇలా యంగ్‌ హీరోల చిత్రాలు సైతం జపాన్‌లో విడుదలయ్యాయి. తాజాగా ఈ జాబితాలోకి నేచురల్ స్టార్‌ నాని చేరారు.

నేచురల్ స్టార్‌ నాని నటించిన ఓ సినిమా ఇప్పుడు జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. నాని చివరిగా నటించిన సరిపోదా శనివారం మూవీ జపాన్‌లో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. సరిపోదా శనివారం సినిమా భారీ వసూళ్లతో రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్లు రాబట్టి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.

ఇండియాలో మంచి విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు జపాన్‌లో విడుదల కానుంది. ఫిబ్రవరి 14వ తేదీన జపాన్‌లో విడుదల చేయనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జపాన్‌ ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంటుందో చూడాలి. ఇదిలా ఉంటే నాని ప్రస్తుతం హిట్‌ 3 సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. గతంలో తన ప్రొడక్షన్ హౌస్‌ ద్వారా హిట్ సిరీస్‌ను నిర్మించిన నాని, ఇప్పుడు స్వయంగా హిట్ 3 లో హీరోగా నటిస్తూ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అంతేకాక, దసరా దర్శకుడితో మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను కూడా ప్రారంభించనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories