Nayanthara : నయనతార ఎమోషనల్ పోస్ట్... 22 ఏళ్ల సినీ జర్నీపై 'లేడీ సూపర్‌స్టార్'

Nayanthara : నయనతార ఎమోషనల్ పోస్ట్... 22 ఏళ్ల సినీ జర్నీపై లేడీ సూపర్‌స్టార్
x

Nayanthara : నయనతార ఎమోషనల్ పోస్ట్... 22 ఏళ్ల సినీ జర్నీపై 'లేడీ సూపర్‌స్టార్'

Highlights

దక్షిణాది సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్‌స్టార్' గా అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి నయనతార సినీరంగ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది.

దక్షిణాది సినీ పరిశ్రమలో 'లేడీ సూపర్‌స్టార్' గా అభిమానుల హృదయాలను గెలుచుకున్న నటి నయనతార సినీరంగ ప్రయాణం 22 ఏళ్ల మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ నోట్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

"మొదటి సారి కెమెరా ముందు నిల్చొని నేటికి 22 ఏళ్లు అయింది. సినిమాలే నా ప్రపంచమవుతాయని అప్పటికి తెలియదు. ప్రతి షాట్‌, ప్రతి ఫ్రేమ్‌, ప్రతి మౌనం నన్ను మార్చేశాయి. నాకు ధైర్యాన్నిచ్చాయి, నన్ను నన్నుగా తీర్చిదిద్దాయి" అంటూ నయనతార తన అనుభూతిని వ్యక్తం చేశారు.

కెరీర్ ప్రయాణం:

2003లో మలయాళ చిత్రం ‘మనస్సినక్కరే’ ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన నయనతార అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో చేసిన ‘చంద్రముఖి’ ఆమెకు టర్నింగ్ పాయింట్ అయింది. గ్లామర్ పాత్రలు, సీరియస్ రోల్స్, హారర్ కథలు, ఫ్యామిలీ డ్రామాలతో సహా అన్ని జానర్‌లలో నటించి ప్రేక్షకుల నమ్మకాన్ని చూరగొన్నారు. కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా, తన వ్యక్తిగత జీవితం, కుటుంబం మధ్య సమతుల్యతను కాపాడుకోవడం ఆమె ప్రత్యేకత.

ఇటీవల ‘జవాన్‌’ సినిమాతో బాలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి మంచి స్పందన అందుకున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో ఎనిమిది ప్రాజెక్టులు ఉన్నాయి. వాటిలో చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ముఖ్యమైనది. ఈ సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

22 ఏళ్ల ఈ అద్భుత ప్రయాణంలో నయనతార సాధించిన విజయాలు, ఆమె కట్టుబాటు, మహిళా నటీమణులకు కొత్త మార్గాన్ని సృష్టించిన విధానం ఆమెను నిజమైన “లేడీ సూపర్‌స్టార్‌” గా నిలబెట్టాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories