Nayanthara: రూ. 100 కోట్ల ఇల్లు కొనుగోలు చేసిన నయన్‌, విఘ్నేష్‌.. ఫొటోలు చూశారా?

Nayanthara Vignesh Shivan Build RS 100 Crore Studio Style House in Chennai Photos Go Viral
x

Nayanthara: రూ. 100 కోట్ల ఇల్లు కొనుగోలు చేసిన నయన్‌, విఘ్నేష్‌.. ఫొటోలు చూశారా?

Highlights

Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం సినిమాలు, యాడ్స్, ప్రొడక్షన్, బిజినెస్‌లతో అతి బిజీగా ఉన్నారు.

Nayanthara: స్టార్ హీరోయిన్ నయనతార ప్రస్తుతం సినిమాలు, యాడ్స్, ప్రొడక్షన్, బిజినెస్‌లతో అతి బిజీగా ఉన్నారు. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా బిజీగా మారిన ఆమె, ప్రస్తుతం సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇక కేవలం సినిమాలకే పరిమితం కాకుండా ఇతర వ్యాపారాలను కూడా ప్రారంభించారు నయనతార. కాగా 2022లో దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో వివాహం తర్వాత కూడా నయన తార సినిమాల్లో బిజీగానే ఉన్నారు.

కాగా తాజాగా ఈ జంట కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్‌లో కొత్త ఇంటిని నిర్మించుకున్న ఈ క్యూట్‌ కపుల్‌.. ఆ ఇంటిని స్టూడియో తరహాలో తీర్చిదిద్దారు. ఈ ఇంటి విస్తీర్ణం సుమారు 7,000 చదరపు అడుగులు కాగా, ఇంటి డిజైన్‌ ప్రత్యేకంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. చెట్లు, గాజు కిటికీలు, హస్తకళలతో కూడిన ఇంటీరియర్ డిజైన్‌, వెరైటీ డెకరేషన్‌లతో ఇంటిని ఏకంగా ఒక స్టూడియోగా మార్చేశారు.

సోషల్‌ మీడియాలో జరుగుతోన్న ప్రచారం ప్రకారం ఈ ఇంటి విలువ ఏకంగా రూ. 100 కోట్లకుపైమాటే. ప్రస్తుతం ఈ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక నయనతార కెరీర్‌ విషయానికొస్తే.. చివరిగా నయనతార నటించిన ‘అన్నపూర్ణి’ చిత్రం 2023లో విడుదలైంది. 2024లో ఆమె నుంచి ఒక్క సినిమా కూడా థియేటర్లలోకి రాలేదు. అయితే, ప్రస్తుతం ఆమె సుందర్ సి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మూక్కుతి అమ్మన్ 2’ సినిమాలో నటిస్తోంది.

ఇవే కాకుండా నయన్ ప్రస్తుతం మన్నంకట్టి, డియర్ స్టూడెంట్స్, టాక్సిక్, రాకాయ్ వంటి పలు ప్రాజెక్టులలో కథానాయికగా నటిస్తోంది. ఇందులో ‘టెస్ట్’ అనే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో సిద్ధార్థ్, ఆర్. మాధవన్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, నయనతార కీలక పాత్రలో కనిపించనున్నారు. శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 4, 2025న ప్రేక్షకుల ముందుకు రానుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories