మహారాణి లుక్‌లో రష్మిక.. ఆమె రాజసం చూస్తే ఫిదా కావాల్సిందే..

మహారాణి లుక్‌లో రష్మిక.. ఆమె రాజసం చూస్తే ఫిదా కావాల్సిందే..
x
Highlights

రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌ తో సత్తా చాటుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో నాన్ స్టాప్...

రష్మిక వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఇటు టాలీవుడ్ అటు బాలీవుడ్‌లో వరుస ఆఫర్స్‌ తో సత్తా చాటుతుంది. ఇప్పుడు చేతినిండా సినిమాలతో నాన్ స్టాప్ షూటింగ్స్‌తో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అందులో ఒకటి ఛావా. తాజాగా ఈ సినిమా నుంచి రష్మిక లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రతి రాజు వెనుక అసమానమైన బలం కలిగిన రాణి ఉంటుంది. స్వరాజ్యం గర్వపడే మహారాణి ఏసుబాయి అంటూ రష్మిక పాత్రను రివీల్ చేశారు. ఇందులో రష్మిక ఛత్రపతి శివాజీ సతీమణి మహారాణి ఏసుబాయి పాత్రలో కనిపించనున్నారు.

ఇందులో పట్టుచీరకట్టులో ఒంటినిండా ఆభరణాలతో మహారాణి రాజసం ఉట్టిపడేలా కనిపించింది రష్మిక. ఓ పోస్టర్ లో ఆమె చిరునవ్వుతో కనిపించగా.. మరో పోస్టర్ లో గంభీరంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇక రష్మిక మందన్న ఇన్‌స్టాలో పోస్ట్ చేసి ప్రతి గొప్ప రాజు వెనుకాల యోధురాలైన భార్య ఉంటుందని కామెంట్ జతచేశారు. ఈ లుక్ లో రష్మిక మందన్న అప్పటి కాలంలో రాణుల్లా కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా కన్పిస్తున్నారు. ఇప్పటివరకు సింపుల్ గా నవ్వుతూ అల్లరి పిల్లలా కనిపించిన రష్మిక లుక్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ లుక్ లో ఒక గొప్ప ఠీవీ ఆమెలో కన్పిస్తుందని కామెంట్స్ చేస్తున్నారు.

మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ మేల్ లీడ్‌గా.. రష్మిక ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్నారు. ఈ కథ మరాఠీలో సాగనుంది. రష్మిక ఇందుకోసం మరాఠి భాష నేర్చుకున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జనవరి 22న ఛావా ట్రైలర్ విడుదల కానుంది. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రస్తుతం రష్మిక ఛావా సినిమాతో పాటు హిందీలో సికిందర్, థామ చిత్రాలు చేస్తోంది. ఇటు తెలుగులో ది గర్ల్ ఫ్రెండ్, కుబేర సినిమాలతో బిజీగా ఉన్నారు. గతేడాది యానిమల్, పుష్ప2 చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నారు. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ అమ్మడు పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. మరి పుష్ప2 తర్వాత హిందీలో రష్మికకు మరో భారీ హిట్ ఖాయమని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి టాక్ తెచ్చుకుంటుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories