నా లోపల ఏదో తెలియని బరువును మోస్తున్నా.. మెగా డాటర్ ఎమోషనల్

నా లోపల ఏదో తెలియని బరువును మోస్తున్నా.. మెగా డాటర్ ఎమోషనల్
x

నా లోపల ఏదో తెలియని బరువును మోస్తున్నా.. మెగా డాటర్ ఎమోషనల్

Highlights

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ఒకవైపు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతుంటే, మరోవైపు ఆమె చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇప్పుడు ఒకవైపు సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా దూసుకుపోతుంటే, మరోవైపు ఆమె చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కెరీర్‌లో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా 'కమిటీ కుర్రోళ్లు' వంటి బ్లాక్ బస్టర్‌తో తన సత్తా ఏంటో నిరూపించుకున్న నిహారిక మనసులో ఏదో తెలియని అలజడి మొదలైనట్లు కనిపిస్తోంది.

నిహారిక కొణిదెల అంటేనే ఒక కాన్ఫిడెంట్ పర్సనాలిటీ. నిర్మాతగా చిన్న సినిమాలకు పెద్ద విజయాలను అందించడంలో ఆమె రూటే సెపరేటు. ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి గద్దర్ అవార్డు రావడంతో ఫుల్ జోష్‌లో ఉన్న నిహారిక, వెంటనే సంతోష్ శోభన్ హీరోగా ‘రాకాస’ అనే విభిన్నమైన ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించింది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో, ఆమె షేర్ చేసిన ఒక పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

తన మనసులోని భావాలను నెటిజన్లతో పంచుకుంటూ నిహారిక చాలా ఎమోషనల్ అయ్యారు."నా మనసులో మాటలతో చెప్పలేని ఏదో తెలియని బరువును మోస్తున్నాను. అది ఒత్తిడో లేక ఇంకేదైనా నాకూ స్పష్టంగా తెలియదు. దాన్ని వివరించడానికి పదాలు దొరకడం లేదు. అయినా సరే నేను లొంగిపోకుండా ముందుకు సాగుతున్నాను" అంటూ రాసుకొచ్చారు.మరి ఆ బాధ నుంచి బయటపడటానికి ఆమె ఏం చేస్తున్నారో కూడా చెప్పారు. కొన్ని రోజులు జిమ్‌లో కష్టపడుతూ, మరికొన్ని రోజులు యోగా, వాకింగ్ ద్వారా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. బయట ప్రపంచానికి ఆమె మామూలుగానే కనిపిస్తున్నా, ఆమె లోపల మాత్రం ఏదో పెద్ద సంఘర్షణే జరుగుతోందని ఆ పోస్ట్ ద్వారా అర్థమవుతోంది.

నిహారిక పోస్ట్ చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో జరిగిన విడాకుల సంఘటన తర్వాత ఆమె కెరీర్‌పైనే పూర్తి దృష్టి పెట్టినప్పటికీ, ఒంటరితనం ఆమెను వేధిస్తోందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం, నిహారిక .. మీరు చాలా స్ట్రాంగ్, ఇలాంటి ఎమోషన్స్ నుంచి త్వరగా బయటకు వచ్చేస్తారు అంటూ ధైర్యం చెబుతున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం..మళ్ళీ పెళ్లి గురించి ఆలోచిస్తున్నారా? అందుకే ఈ బరువు అనిపిస్తోందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

వ్యక్తిగత విషయాలు ఎలా ఉన్నా, ప్రొఫెషనల్‌గా మాత్రం నిహారిక తగ్గేదే లేదంటున్నారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై వస్తున్న ‘రాకాస’ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. కొత్త కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా నిహారికకు నిర్మాతగా మరో మైలురాయి అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories