Nikhil: కార్తికేయ 3పై అప్డేట్‌ ఇచ్చిన నిఖిల్‌.. ఏమన్నారంటే..?

Nikhil Siddhartha Gives Key Update on Karthikeya 3
x

Nikhil: కార్తికేయ 3పై అప్డేట్‌ ఇచ్చిన నిఖిల్‌.. ఏమన్నారంటే..?

Highlights

Nikhil: నిఖిల్‌ హీరోగా వచ్చిన కార్తికేయ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Nikhil: నిఖిల్‌ హీరోగా వచ్చిన కార్తికేయ మూవీ ఎంతటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కార్తికేయ మొదటి పార్ట్‌ మంచి విజయాన్ని అందుకున్న నేపథ్యంలో సీక్వెల్‌ను పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల చేశారు. దీంతో ఈ సినిమా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. కాగా కార్తికేయ చిత్రానికి 3వ పార్ట్‌ కూడా వస్తుందన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి నిఖిల్‌ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ప్రస్తుతం స్వయంభూ షూటింగ్‌లో బిజీగా ఉన్న నిఖిల్‌ తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కార్తికేయ 3 కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలిపిన నిఖిల్‌ ఈ సినిమాను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. కాగా చందూ మొండేటీ స్క్రిప్ట్‌ పూర్తి చేసే పనిలో ఉన్నారని అంతలోపు 'ది ఇండియా హౌస్‌' చిత్రీకరణ పూర్తి చేస్తానని చెప్పుకొచ్చారు.

ఇక స్వయంభూ మూవీ గురించి మాట్లాడుతూ.. 'ఈ సినిమా కోసం గత ఏడాది నుంచే సిద్ధమవుతున్నాం. నా కెరీర్‌లో ఇదే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రం. ప్రస్తుతం 95 శాతం షూటింగ్‌ పూర్తయింది. రహస్యంగా చిత్రీకరణ జరుపుతున్నాం. ‘స్వయంభూ’ తప్పకుండా ఒక విజువల్‌ ట్రీట్‌గా ఉండబోతుంది' అని చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ‘స్వయంభూ’లో నిఖిల్‌ పోరాటయోధుడిగా కనిపించనున్నారు. ఇందులో సంయుక్త మేనన్‌ ఆయనకు జోడీగా నటిస్తున్నారు. పాత్రలో పరకాయ ప్రవేశం కోసం నిఖిల్‌ ఎనిమిది నెలలు కఠినమైన డైట్‌ ఫాలో అయ్యారు. మార్షల్‌ ఆర్ట్స్‌, గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. అలాగే వియత్నాంలో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రానికి పని చేసిన స్టంట్‌ కొరియోగ్రాఫర్‌ కింగ్‌ సోలోమాన్‌ వద్ద 45 రోజులు శిక్షణ తీసుకున్నారు. మరి స్వయంభూ మూవీ బాక్సాఫీస్‌ వద్ద ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories