Nikhil: మరో పాన్ ఇండియా మూవీలో నిఖిల్

Nikhil: మరో పాన్ ఇండియా మూవీలో నిఖిల్
x

Nikhil: మరో పాన్ ఇండియా మూవీలో నిఖిల్

Highlights

స్టార్ హీరోలకు సైం మైండ్ బ్లాక్ అయ్యేలా నిఖిల్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్నాడు.

Nikhil: కార్తికేయ2తో దేశ వ్యాప్తంగా నిఖిల్ సంచలనం సృష్టించడమే కాదు తన మార్కెట్ ను సైతం అమాంతం పెంచేసుకున్నాడు. కార్తికేయ2 ఇండియా వైడ్ ఆదరణ దక్కించుకోవడంతో నిర్మాతలు నిఖిల్ తో పాన్ ఇండియా సినిమాలు తీసేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలకు సైం మైండ్ బ్లాక్ అయ్యేలా నిఖిల్ వరుసపెట్టి పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్నాడు.

ప్రస్తుతం నిఖిల్ స్పై అనే యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ డెత్ మిస్టరీ ఆధారంగా గ్యారీ బిహెచ్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా స్పై తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రోమోలు స్పై చిత్రానికి భారీ అంచనాలు పెంచాయి. ఇక హీరో రాంచరణ్ నిర్మాణంలో ది ఇండియన్ హౌస్ అంటూ మరో పాన్ ఇండియా మూవీని నిఖిల్ అనౌన్స్ చేశాడు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ 140వ జయంతి సందర్భంగా ఆయన జీవితంపై ది ఇండియా హౌస్ ను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో అనుపమ్ ఖేర్ కూడా నటిస్తున్నారు.

ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్ని ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటున్న నిఖిల్..తాజాగా మరో బిగ్ ప్రాజెక్ట్ తో సర్ ప్రైజ్ చేశాడు. ఇదే తన 20వ చిత్రమంటూ రాజదండంతో కూడిన ప్రీ లుక్ ని నిఖిల్ రిలీజ్ చేశాడు. డెబ్యూ డైరెక్టర్ భరత్ కృష్ణమాచారి తెరకెక్కించే ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. నిఖిల్ రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక రాజదండం కనిపించింది. దీన్ని చూస్తుంటే పార్లమెంట్ ప్రారంభోత్సవంలో ఉపయోగించిన సింగోల్ గుర్తుకువస్తుంది. రాజ్యాధికారం బదిలీకి గుర్తుగా సింగోల్ ఉపయోగిస్తారనే విషయం మనకు తెలిసిందే కదా.

నిఖిల్ 20వ ప్రాజెక్ట్ గా రాబోతున్న ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు తన బర్త్ డే(జూన్ 2) సందర్భంగా రిలీవ్ చేయనున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ సాంకేతిక నిపుణులు వర్క్ చేయనున్నారు. మొత్తంగా చూస్తుంటే నిఖిల్ కెరీర్ లో మరో మైలురాయిగా నిలిచే సినిమా రెడీ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories