Nilave Movie Success Meet: నేటి తరం ‘గీతాంజలి’లా ‘నిలవే’.. మా బాహుబలి ఈ చిత్రమే: హీరో సౌమిత్ ఎమోషనల్ స్పీచ్!

Nilave Movie Success Meet: చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘నిలవే’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ మంగళవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి.
Nilave Movie Success Meet: చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘నిలవే’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ మంగళవారం హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 13న విడుదలై ‘బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామా’గా ప్రేక్షకుల ఆదరణ పొందుతోంది.
ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. సముద్ర మాట్లాడుతూ.. ఈ వాలెంటైన్స్ వీక్‌లో విడుదలైన సినిమాల్లో ‘నిలవే’ సైలెంట్ హిట్‌గా నిలిచిందని, హీరో హీరోయిన్లకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆకాంక్షించారు. మరో అతిథి జెమిని సురేష్ మాట్లాడుతూ.. ఈ చిత్రం బాపు బొమ్మలా, విశ్వనాథ సత్యనారాయణ కవితలా ఎంతో అందంగా ఉందని, నేటి జనరేషన్ ‘గీతాంజలి’లా నిలుస్తుందని కొనియాడారు. ఆస్కార్ గ్రహీత చంద్రబోస్ వీడియో సందేశం ద్వారా చిత్ర యూనిట్‌ను అభినందించారు.
మాకు ఇదే ‘బాహుబలి’ - హీరో సౌమిత్:
హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. "కొత్త వాళ్లమైనా మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. రాజమౌళి గారికి 'బాహుబలి' చేయడానికి మూడేళ్లు పడితే, మాకు ఈ సినిమా పూర్తి చేయడానికి మూడేళ్లు పట్టింది. మా దృష్టిలో ‘నిలవే’ మా బాహుబలి లాంటిది. థియేటర్ల వద్ద హౌస్‌ఫుల్ బోర్డులు చూస్తుంటే మా కష్టం మర్చిపోయాం" అని అన్నారు.
దర్శక నిర్మాతల ధీమా:
దర్శకుడు సాయి కే వెన్నం మాట్లాడుతూ.. సినిమా ఎందుకు తీస్తున్నామనే కారణం బలంగా ఉంటే విజయం దక్కుతుందని, ఈ సినిమాతో అదే నిరూపితమైందని అన్నారు. నిర్మాత రాజ్ అల్లాడ, మాధూరి మాట్లాడుతూ.. మ్యూజిక్ ఈ చిత్రానికి ప్రాణం పోసిందని, ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్ సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్, హీరోయిన్ శ్రేయాసి సేన్ తమ ఆనందాన్ని పంచుకున్నారు.
POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం, యూత్ మరియు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటూ డీసెంట్ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



