"మాచర్ల నియోజకవర్గం" విషయంలో తారుమారైన నితిన్ అంచనాలు

Nithins Macherla Niyojakavargam Movie Budget Increased
x

"మాచర్ల నియోజకవర్గం" విషయంలో తారుమారైన నితిన్ అంచనాలు

Highlights

Macherla Niyojakavargam: ఈ మ‌ధ్య కాలంలో చాలా వరకు సినిమాలకు అనుకున్న బ‌డ్జెట్ ఒక‌టి అయితే చివ‌రికి అయ్యేది ఇంకొక‌టి అవుతోంది.

Macherla Niyojakavargam: ఈ మ‌ధ్య కాలంలో చాలా వరకు సినిమాలకు అనుకున్న బ‌డ్జెట్ ఒక‌టి అయితే చివ‌రికి అయ్యేది ఇంకొక‌టి అవుతోంది. పాన్ ఇండియా మార్కెట్, డిజిట‌ల్ మార్కెట్, ఓటీటీ రైట్స్ రావ‌డంతో బ‌డ్జెట్ పెరిగినా కొందరు నిర్మాతలు ఫ‌ర్వాలేద‌నుకొంటున్నారు. తాజాగా నితిన్ సినిమాకీ ఇదే ప‌రిస్థితి ఎదురైంది. నితిన్ హీరోగా న‌టిస్తున్న చిత్రం "మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం" ఇప్పుడు బడ్జెట్ ఇబ్బందులను ఎదుర్కొంటోంది.

నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట్ మూవీస్‌ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోంది. సొంత బ్యానర్ కాబట్టి హీరోలు బడ్జెట్ విషయంలో పొదుపుగా వ్య‌వ‌హ‌రిస్తారు. కానీ ఈ సినిమా విష‌యానికొస్తే నితిన్ అలా చేయలేకపోయారు. ముందు అనుకొన్న బ‌డ్జెట్ కంటే 30 శాతం ఖ‌ర్చు పెరిగిపోయిందట. ద‌ర్శ‌కుడు ఎం ఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇదే తొలి సినిమా కాబట్టి రీషూట్లు కూడా చేశారట. దీంతో బ‌డ్జెట్ అదుపు త‌ప్పింద‌ని తెలుస్తోంది.

కానీ సొంత డబ్బులే కాబట్టి బ‌డ్జెట్ పెరిగినా ఔట్ పుట్ ముఖ్యం అనుకుని నితిన్ వీటిని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని టాక్‌. మరి సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి. కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. హాట్ బ్యూటీ క్యాథరిన్ తెరిసా కూడా ఈ సినిమాలో నితిన్ సరసన హీరోయిన్గా కనిపించనుంది. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఆగస్ట్ 12 న విడుదల కాబోతోందని దర్శకనిర్మాతలు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories