NTR Rejected Movies: ఆ రెండు సినిమాలు వదులుకుని తప్పు చేశా

NTRs Big Miss: ఎన్టీఆర్ తన కెరీర్ లో రెండు సూపర్ హిట్ సినిమాలను మిస్ చేసుకున్నారు
x

NTRs Big Miss

Highlights

NTR Rejected Movies: ఎన్టీఆర్ తన కెరీర్ లో రెండు సినిమాలను మిస్ చేసుకున్నారు. అవి వేరే హీరోలకు సూపర్ హిట్స్ అందించాయి

NTR Rejected Movies: జూనియర్ ఎన్టీఆర్ లాంటి పవర్‌హౌస్ పర్ఫార్మర్ ఒక సాఫ్ట్ లవ్ స్టోరీలో నటిస్తే ఎలా ఉంటుంది? బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట సాగించే మాస్ కా బాప్ ఒక సున్నితమైన ఫ్యామిలీ డ్రామాలో కనిపిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఈ ఊహే నందమూరి అభిమానులకు ఒక మధురమైన అనుభూతినిస్తుంది. అయితే, టాలీవుడ్ చరిత్రలో కొన్ని 'మిస్సింగ్ లింక్స్' ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి. అందులో ప్రధానమైనవి 'భద్ర' ,'బొమ్మరిల్లు'. సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో వదులుకున్న కథ మరో హీరోకి లైఫ్ ఇవ్వడం సహజం. కానీ, ఆ నిర్ణయం వెనుక ఉన్న ఆలోచనలు, ఆ తర్వాత కలిగే చిన్నపాటి అసంతృప్తి గురించి స్వయంగా తారక్ పంచుకోవడం విశేషం.

బోయపాటి శ్రీను అనగానే మనకు గుర్తొచ్చేది హై-వోల్టేజ్ యాక్షన్. కానీ ఆయన తొలి చిత్రం 'భద్ర'లో యాక్షన్‌తో పాటు ఒక అందమైన ప్రేమకథ, అంతకు మించిన ఎమోషన్ ఉంది. ఈ కథ మొదట తారక్ దగ్గరికే వెళ్లింది. అప్పటికే 'సింహాద్రి' వంటి ఇండస్ట్రీ హిట్లతో మాస్ ఇమేజ్ శిఖరాగ్రాన ఉన్న తారక్‌కు, భద్ర కథలోని కొత్తదనం ఆ సమయంలో కనెక్ట్ కాలేదు.ఆ కథ విన్నప్పుడు ఎందుకో అంతగా నచ్చలేదు, కానీ థియేటర్లో సినిమా చూశాక... నేను చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది అని తారక్ నిజాయితీగా అంగీకరించారు. రవితేజ కెరీర్‌లో అది ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

NTR Rejected మూవీస్: ఇక 'బొమ్మరిల్లు' విషయం మరింత ఆసక్తికరం. సిద్ధార్థ్ కెరీర్‌ను మలుపు తిప్పిన ఈ క్లాసిక్ కథను దర్శకుడు భాస్కర్ మొదట వినిపించింది ఎన్టీఆర్‌కే. కథ వినగానే తారక్ ఫిదా అయిపోయారు. తండ్రీకొడుకుల మధ్య ఉండే ఆ సున్నితమైన పోరాటం తారక్‌కు బాగా నచ్చింది. కానీ, అక్కడ తారక్ ఒక 'నటుడి' కంటే తన 'అభిమానుల' గురించి ఎక్కువగా ఆలోచించారు.

అప్పట్లో ఎన్టీఆర్ అంటే కేవలం ఫైట్లు, పవర్ ఫుల్ డైలాగులు మాత్రమే ఆశించేవారు ఫ్యాన్స్.నా అభిమానులు నిరాశ చెందుతారేమో అనే భయంతో ఆ అద్భుతమైన కథను వదులుకున్నారు.తర్వాత ఆ సినిమా సృష్టించిన ప్రభంజనం చూశాక, మంచి సినిమాను మిస్ అయ్యాను అనే చిన్న బాధ ఆయనలో ఉండిపోయింది.

ఈ రెండు సినిమాల రిజెక్షన్ తారక్ కెరీర్‌లో ఒక కీలక మలుపు అని చెప్పవచ్చు. బహుశా ఆ సినిమాల ప్రభావమే కావచ్చు... తర్వాతి కాలంలో తారక్ తన పంథాను మార్చుకున్నారు. ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా 'అదుర్స్'లో చారిగా, 'టెంపర్'లో నెగటివ్ షేడ్స్ ఉన్న పోలీస్‌గా, 'నాన్నకు ప్రేమతో'లో క్లాస్ లుక్‌లో కనిపిస్తూ నటుడిగా తనను తాను మల్చుకున్నారు.ఒకవేళ 'భద్ర'లో తారక్ ఊరమాస్ ఎనర్జీ, 'బొమ్మరిల్లు'లో తారక్ ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తోడై ఉంటే.. ఆ సినిమాల రేంజ్ మరోలా ఉండేదేమో. ఏదేమైనా, ఆ రిజెక్షన్స్ ఇచ్చిన అనుభవమే నేడు మనకు గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్‌ను అందించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories