NTR: ఆ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్‌.. ఆస‌క్తి పెంచుతోన్న అప్డేట్

NTR: ఆ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్‌.. ఆస‌క్తి పెంచుతోన్న అప్డేట్
x

NTR: ఆ బ‌యోపిక్‌లో ఎన్టీఆర్‌.. ఆస‌క్తి పెంచుతోన్న అప్డేట్

Highlights

NTR: ఈ చిత్ర కథ భారతీయ సినిమా ప్రారంభం, అభివృద్ధి నేపథ్యంలో రూపొందించబోతోందని స‌మాచారం.

NTR: వ‌రుస సినిమాలతో నిత్యం బిజీగా ఉన్న స్టార్ హీరో ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఇప్పటి వరకు ఎప్పుడూ న‌టించ‌ని పాత్ర‌లో ఎన్టీఆర్ క‌నిపించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. భారతీయ సినీ పరిశ్రమ స్థాపకుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితం ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌లో ఎన్టీఆర్‌ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

రెండేళ్ల క్రితం ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి స‌మ‌ర్ఫ‌ణ‌లో మేడ్ ఇన్ ఇండియా అనే ప్యాన్ ఇండియా ప్రాజెక్టును ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు ఎం.ఎం. కార్తికేయ, నిర్మాత వరుణ్ గుప్తా కలిసి నిర్మిస్తున్నారు. దర్శకత్వ బాధ్యతలను నితిన్‌ కక్కర్‌ చేపట్టనున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌గా మారిందని తెలుస్తోంది.

ఈ చిత్ర కథ భారతీయ సినిమా ప్రారంభం, అభివృద్ధి నేపథ్యంలో రూపొందించబోతోందని స‌మాచారం. ఈ ప్రాజెక్ట్‌లో ఎన్టీఆర్‌ నటించబోతున్నట్లు బీ-టౌన్ సమాచారం. కథ విని ఆయన ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. "ఇది ఓ గొప్ప ప్రయాణాన్ని తెలిపే కథ. ఇది భారతీయ సినిమా ఆవిర్భావాన్ని ప్రపంచానికి తెలియజేస్తుంది. స్క్రిప్ట్ విన్న వెంటనే ఎన్టీఆర్‌ అంగీకరించినట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రాజెక్టుపై బృందం చాలా ఆసక్తిగా ఉంది. ఇప్పటికే చర్చలు పూర్తయ్యాయి. ఫైనల్ స్క్రిప్ట్‌ను ఫిక్స్ చేశారు" అని సమాచారం.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ నాలుగు పెద్ద ప్రాజెక్ట్స్‌లో పని చేస్తున్నారు. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో డ్రాగన్ షూటింగ్‌లో ఉన్నారు. బాలీవుడ్ ఎంట్రీ కోసం వార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండు పూర్తైన తర్వాత దేవర 2 ప్రారంభం కానుంది. అంతేకాదు, తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కూడా ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు ఉన్నాయి. ఈ లైనప్‌లో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ చేరడం ఆస‌క్తిని పెంచుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories