'వార్ 2' షూటింగ్ పూర్తిచేసిన ఎన్టీఆర్ – హృతిక్ ఎనర్జీ అద్భుతం అంటున్న తారక్

వార్ 2 షూటింగ్ పూర్తిచేసిన ఎన్టీఆర్ – హృతిక్ ఎనర్జీ అద్భుతం అంటున్న తారక్
x

'వార్ 2' షూటింగ్ పూర్తిచేసిన ఎన్టీఆర్ – హృతిక్ ఎనర్జీ అద్భుతం అంటున్న తారక్

Highlights

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్ వార్ 2 షూటింగ్ పూర్తి అయింది. ఈ విషయాన్ని సోమవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించిన జూనియర్ ఎన్టీఆర్, తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయిందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్, సహనటుడు హృతిక్ రోషన్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. "సెట్‌లో హృతిక్ సర్‌తో కలిసి పనిచేయడం ఒక అద్భుత అనుభవం. ఆయన ఎనర్జీ నేను ఎప్పుడూ అభిమానిస్తాను. ఈ సినిమాతో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను" అని ఎన్టీఆర్ భావోద్వేగంగా వెల్లడించారు.

అలాగే, దర్శకుడు అయాన్ ముఖర్జీ ప్రేక్షకుల కోసం ఒక పెద్ద సర్‌ప్రైజ్ ప్యాకేజీ సిద్ధం చేశారని చెప్పారు. యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థతో పాటు చిత్ర బృందానికి ఎన్టీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో విడుదల కానుంది. ఎన్టీఆర్ ఇచ్చిన తాజా అప్‌డేట్‌తో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories