OG వివాదం: సుజీత్-దానయ్య మధ్య ఏమైంది?

OG వివాదం: సుజీత్-దానయ్య మధ్య ఏమైంది?
x

OG వివాదం: సుజీత్-దానయ్య మధ్య ఏమైంది?

Highlights

OG controversy: పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అతిపెద్ద హిట్ OG. కానీ, దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య మధ్య విభేదాలు తలెత్తాయి. బడ్జెట్ అంశంపై గొడవలు జరిగి, వీరి తదుపరి ప్రాజెక్ట్ కూడా రద్దయినట్లు సమాచారం. సుజీత్ ఓజికి సొంత డబ్బు కూడా ఖర్చు చేశారని టాక్.

OG controversy: పవన్ కళ్యాణ్ నటించిన OG సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. అయితే, ఈ చిత్రం చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయి. దర్శకుడు సుజీత్, నిర్మాత దానయ్య మధ్య బడ్జెట్‌పై తీవ్ర విభేదాలు తలెత్తాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.

సినిమా బడ్జెట్ ప్రారంభంలో నిర్ణయించిన దాని కంటే ఎక్కువైందని, దీనిపై దానయ్య అసంతృప్తి వ్యక్తం చేశారని సమాచారం. సుజీత్ మాత్రం బడ్జెట్ పెరగడానికి తగిన కారణాలు ఉన్నాయని సమర్థించుకున్నారు.

ఈ విభేదాల కారణంగా వీరిద్దరూ తమ తదుపరి ప్రాజెక్ట్‌ను రద్దు చేసుకున్నారు. నాని, సుజీత్ కాంబినేషన్‌లో దానయ్య నిర్మాణంలో ప్రకటించిన సినిమా నీహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌కు మారింది.

అంతేకాదు, OG కోసం సుజీత్ సొంత డబ్బు కూడా ఖర్చు చేశారని ఒక బజ్ వినిపిస్తోంది. ఈ విషయంపై వీరిద్దరూ బహిరంగంగా మాట్లాడకపోయినా, ఇండస్ట్రీలో ఈ చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. వీరు విడిపోవడానికి నిజమైన కారణం ఏమిటో తెలియాలంటే, వారి నుంచి స్పష్టత వచ్చే దాకా ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories