‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్‌కు మళ్లీ సోషల్ మీడియాలో బ్యాండే!

‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్‌కు మళ్లీ సోషల్ మీడియాలో బ్యాండే!
x

‘ఆదిపురుష్’ డైరెక్టర్ ఓం రౌత్‌కు మళ్లీ సోషల్ మీడియాలో బ్యాండే!

Highlights

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ను ప్రపంచ స్థాయిలో ఆకాశానికెత్తిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ‘ఆదిపురుష్’ రూపంలో ఓం రౌత్‌కు దక్కింది.

‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ను ప్రపంచ స్థాయిలో ఆకాశానికెత్తిన క్రేజ్‌ను క్యాష్ చేసుకునే అవకాశం ‘ఆదిపురుష్’ రూపంలో ఓం రౌత్‌కు దక్కింది. నిర్మాత తలచినంత ఖర్చు పెట్టాడు, కథగా భారతీయులు ఆరాధించే రామాయణం తీసుకున్నాడు. అయినా కూడా, ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ఓం రౌత్ దుర్వినియోగం చేశాడనే విమర్శలు అప్పటి నుంచీ ఇప్పటివరకు కొనసాగుతూనే ఉన్నాయి.

అందుబాటులో ఉన్న అద్భుతమైన టెక్నాలజీని సరిగా వినియోగించకుండా, రామాయణ గాథను వికృతీకరించినట్లుగా ఓం రౌత్ చూపించిన దృశ్యాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచాయి. ఫలితంగా ‘ఆదిపురుష్’ దేశంలోనే అతి పెద్ద ఫెయిల్యూర్లలో ఒకటిగా నిలిచింది.

ఇప్పటికీ ఎప్పుడైనా పురాణ కథల నేపథ్యంలో వచ్చిన సినిమాలు హిట్ అయితే లేదా గొప్ప విజువల్స్ ఉన్న సినిమాలు వస్తే, నెటిజన్లు ఓం రౌత్‌ను టార్గెట్ చేయడం మామూలైపోయింది. ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’తో వావ్ అనిపించినప్పుడు, నాగ్ అశ్విన్ ‘కల్కి 2898 AD’లో మహాభారతాన్ని ఆధారంగా తీసుకుని కనువిందు చేసినప్పుడు, ఓం రౌత్ ట్రోలింగ్‌కు గురవడమే జరగింది.

ఇప్పుడు అదే తరహాలో, నితీశ్ తివారి రూపొందిస్తున్న ‘రామాయణం’ నుంచి వచ్చిన గ్లింప్స్ చూసిన నెటిజన్లు మళ్లీ ఓం రౌత్‌ను గుర్తు చేసుకున్నారు. రణబీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ లాంటి స్టార్ కాస్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమా గ్లింప్స్‌లో విజువల్స్, మ్యూజిక్, డివోషనల్ టోన్ అద్భుతంగా ఉండటంతో సోషల్ మీడియాలో “ఇదే రామాయణం చూపించాల్సిన విధానం” అంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదే సమయంలో, ఓం రౌత్ చేసిన తప్పులు, చెడిన ఆర్ట్ డైరెక్షన్, తక్కువ స్థాయి డైలాగ్స్ అన్నీ తిరిగి చర్చకు వచ్చాయి. ‘ఆదిపురుష్’ను ఎలా చెడగొట్టారో ఈ కొత్త రామాయణం టీమ్ ఎలా చేయాలో చూపించిందని నెటిజన్లు అంటున్నారు. ఈ గ్లింప్స్ ఓం రౌత్ వైఫల్యాన్ని మరింత హైలైట్ చేసినట్లైంది.

ఇకపై కూడా ఇలా మలిచిన మంచి కంటెంట్ ఏదైనా విడుదలైతే, ఓం రౌత్ పేరు మళ్లీ సోషల్ మీడియాలో చర్చకు వస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఆదిపురుష్’ అవకాశం ఎంత గొప్పదో, దాన్ని ఎలా వృథా చేసారో ‘రామాయణం’ గ్లింప్స్‌తో మరోసారి స్పష్టమైంది.

Show Full Article
Print Article
Next Story
More Stories