OTT: ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్.. ప్రతీ క్ష‌ణం నరాలు తెగే ఉత్కంఠ

OTT: ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్.. ప్రతీ క్ష‌ణం నరాలు తెగే ఉత్కంఠ
x

OTT: ఓటీటీలో సైకలాజికల్ థ్రిల్లర్.. ప్రతీ క్ష‌ణం నరాలు తెగే ఉత్కంఠ

Highlights

OTT: హార‌ర్ మూవీల‌ను చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వీటికి ఆద‌ర‌ణ భారీగా పెరుగుతోంది.

హార‌ర్ మూవీల‌ను చూసే వారి సంఖ్య పెరుగుతోంది. మ‌రీ ముఖ్యంగా ఓటీటీలు అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత వీటికి ఆద‌ర‌ణ భారీగా పెరుగుతోంది. భాష‌తో సంబంధం లేకుండా ఇత‌ర లాంగ్వేజెస్ మూవీల‌ను కూడా ఎక్కువ‌గా వీక్షిస్తున్నారు. ఇలాంటి ఓ ఆస‌క్తిక‌ర‌మైన సైకలాజిక‌ల్ హార‌ర్ థ్రిల్ల‌ర్ సిరీస్‌ "ఖౌఫ్ష ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ టాప్ ట్రెండింగ్ హారర్ సిరీస్‌ల్లో ఒకటిగా నిలిచి IMDbలో 7.6 రేటింగ్‌ సొంతం చేసుకుంది. ఈ సిరీస్ కథ మొత్తం మాధురి అనే యువతి చుట్టూ తిరుగుతుంది. గ్వాలియర్ నుంచి ఢిల్లీలో ఉద్యోగాన్వేషణలో వచ్చిన మాధురి, ఓ మహిళల హాస్టల్‌లో రూమ్ నంబర్ 333లో ఉంటుంటుంది. కానీ ఆ గది గురించి గతంలో దెయ్యం ఉంద‌న్న‌ ప్రచారం ఉంటుంది. ఆ గదిలో అడుగుపెట్టిన తర్వాత ఆమె జీవితంలో అనూహ్యమైన, భయానక సంఘటనలు మొదలవుతాయి.

ఈ గదికి సంబంధించిన గతం ఆమెను మానసికంగా ఎంతగానో వేధిస్తుంటుంది. ఆమె అనుభవించే అజ్ఞాత, కలలు, మానసిక ఒత్తిడి కథను మరింత సస్పెన్స్‌గా తీర్చిదిద్దాయి. ఇక రజత్ కపూర్ పోషించిన హకీమ్ పాత్ర కథలో ఎంతో కీలకంగా ఉంటుంది. మాధురిపై జరిగే కుట్రల వెనక అసలైన ఉద్దేశం ఏంటి అనేది ఆసక్తికరంగా ముందుకు సాగుతుంది.

రెగ్యులర్ హారర్ కంటెంట్‌తో పోలిస్తే ఇందులో సైకలాజికల్ థ్రిల్ ఎక్కువగా ఉంటుంది. ఇది సాధారణ హారర్ అభిమానులకు కాకుండా, డీప్ కంటెంట్‌ కోరుకునే వారికి కూడా నచ్చుతుంది. "ఖౌఫ్" సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌లో ఉంది. మొదటి ఎపిసోడ్ 43 నిమిషాలపాటు ఉండగా, మిగిలిన ఎపిసోడ్‌లు సుమారు 50 నిమిషాలపాటు ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories