OTT: ఈ సినిమా ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీలో భయపెడుతోన్న మూవీ

OTT
x

OTT: ఈ సినిమా ఒంటరిగా అస్సలు చూడకండి.. ఓటీటీలో భయపెడుతోన్న మూవీ

Highlights

OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

OTT: ఓటీటీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. భాషతో సంబంధం లేకుండా మంచి కంటెంట్‌ను వీక్షించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా హార్రర్‌, రొమాంటిక్‌ మూవీస్‌కు జై కొడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ హార్రర్‌ మూవీ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇంతకీ ఏంటా సినిమా.? ఎందులో స్ట్రీమింగ్ అవుతోంది.? ఆ సినిమా కథెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతోన్న 'చైత్ర' అనే హారర్ మూవీ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాను ఒంటరిగా చూస్తే కచ్చితంగా దడుకోవాల్సిందే అంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమా కథేంటంటే.. ఓ భార్యాభర్తలు ఒకరోజు ఫంక్షన్‌కి బైక్‌పై బయలుదేరుతారు. మధ్యలో బైక్ స్కిడ్ అవ్వడంతో వారు కిందపడిపోతారు. బట్టలు చెదిరిపోవడంతో, సమీపంలో ఉన్న భార్య స్నేహితురాలు చైత్ర ఇంటికి వెళ్లతారు. ఇంటికి వెళ్లిన తర్వాత చైత్ర ఎక్కడా కనిపించదు, కానీ ఆమె ఫోన్ మాత్రం మోగుతూనే ఉంటుంది.

అతను ఫోన్ లిఫ్ట్ చేస్తే.. చైత్ర భర్త మాట్లాడతాడు. "ఆమెకు మానసిక సమస్య ఉంది, పై అంతస్తులో ఉంది" అని చెప్తాడు. వారు పైకెళ్లేసరికి, ఆమె దూకుతున్నట్టు కనిపిస్తుంది. గబగబా కిందకు వచ్చేసరికి ఆమె కనిపించదు. ఇదే సమయంలో ఓ యువతి ఇంట్లోకి ప్రవేశించి, తన బాయ్‌ఫ్రెండ్ అక్కడ బందీగా ఉన్నాడని చెబుతుంది. అందరు లోపలికి వెళ్లగానే, చైత్ర దగ్గర పడి ఉండగా ఆమె బాయ్‌ఫ్రెండ్ అలసిపోయి కనిపిస్తాడు. ఇద్దరినీ హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. అప్పుడే అసలైన ట్విస్టులు బయటపడుతాయి.

చైత్రకు చనిపోయిన వ్యక్తుల ఆత్మలు కనిపిస్తుంటాయని, అవే ఆమెను మానసికంగా వేధిస్తున్నాయనే విషయం బయటపడుతుంది. అయితే ఆమె కనిపెట్టిన ఆత్మలు ఎవరూ మరోవరే కాదు, హాస్పిటల్‌లో చేర్చిన ఆ భార్యాభర్తలే కావడం. ఆ తర్వాత అసలు కథ ఏవిధంగా మలుపు తిరిగిందో.. చైత్ర ఎవరు? దివ్య ఎవరు? దెయ్యాలు నిజంగా ఎవరు? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఆసక్తికరమైన థ్రిల్లింగ్ కథతో తెరకెక్కిన ఈ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌లో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories