OTT Movie: బంగారాన్ని ప్రేమించే భర్త.. మొగుడికి చుక్కలు చూపించే భార్య

OTT Movie
x

OTT Movie: బంగారాన్ని ప్రేమించే భర్త.. మొగుడికి చుక్కలు చూపించే భార్య

Highlights

OTT Movie: ఇటీవల కాలంలో వెరైటీ కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది మలయాళ ఇండస్ట్రీ.ఆ సినిమాలకు మన వాళ్లు అయితే పెద్ద ఫ్యాన్స్ గా మారిపోయారు.

OTT Movie: ఇటీవల కాలంలో వెరైటీ కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది మలయాళ ఇండస్ట్రీ.ఆ సినిమాలకు మన వాళ్లు అయితే పెద్ద ఫ్యాన్స్ గా మారిపోయారు. ఈ సినిమాలను చాలా వరకు మిస్ కాకుండా చూస్తున్నారు. వీటిలో బాసిల్ జోసెఫ్ నటించి, దర్శకత్వం వహించిన సినిమాల గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. పక్కింటి అబ్బాయిలా కనిపించే ఈ హీరో నటన కూడా చాలా న్యాచురల్ గా ఉంటుంది.ఆయన లేటెస్ట్ మూవీ ఒకటి ఓటీటీలోకి వచ్చింది.

ఈ సినిమానే ‘పొన్మన్’ (Ponman). జోతిష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చింది. ఇందులో జోసెఫ్, సాజిన్ గోపు లిజోమోల్ మెయిన్ లీడ్ రోల్స్ పోషించారు.ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో రిలీజ్ అయింది. మూడు కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ రూ.10కోట్లకు పైగా వసూలు చేసింది. మార్చి 14 నుంచి ఈ కామెడీ సినిమా జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఇది అందుబాటులో ఉంది.

ఇక కథలోకి వెళితే.. ఓ కుటుంబంలో పెళ్లిచూపులు జరుగుతాయి. అయితే పెళ్లి కొడుకు కట్నంగా 15సవర్ల బంగారం డిమాండ్ చేస్తాడు. కానీ ఆ కుటుంబం వద్ద అంత డబ్బు ఉండదు. వీరంతా కలిసి హీరో దగ్గర బంగారాన్ని అరువుగా తీసుకుంటాడు. ఇతడు కూడా ఒక బంగారం షాపుకి ఏజెంట్ గా ఉంటాడు. అయితే పెళ్లికి వచ్చిన వాళ్లు కట్నాలను చదివిస్తే.. ఆ పైసలతో ఆ అప్పు తీర్చాలని అనుకుంటారు తీసుకున్నా వాళ్లు. హీరో అనుకున్నట్టుగానే బంగారాన్ని ఆ కుటుంబానికి ఇస్తాడు. అయితే పెళ్లికి అనుకున్నంత మంది రాకపోవడంతో వాళ్లకు చదవింపులు కూడా తక్కువగా వస్తాయి. దీంతో అప్పు ఎలా తీర్చాలని ఆలోచనలో పడతారు. పెళ్ళికొడుకు, పెళ్ళికూతురు మొదటి రాత్రి చేసుకుంటారు. రు ఆ సమయంలో హీరో మాత్రం బయట కాపలా కాస్తుంటాడు. వాళ్లు బయటికి వస్తే బంగారాన్ని అడిగి తీసుకువెళ్లాలని అక్కడే ఉంటారు.

చివరికి వాళ్లు అక్కడి నుంచి తెలివిగా పెళ్లి కొడుకు ఊరికి వెళ్లిపోతారు. హీరోకు షాక్ తగిలినట్లు అవుతుంది. పెళ్ళికొడుకు ఏరియా చాలా డేంజరస్ గా ఉంటుంది. అక్కడ రౌడీయిజం ఎక్కువగా ఉంటుంది. అక్కడికి వెళ్లి బంగారాన్ని తీసుకురావడానికి హీరో వెళ్తాడు. మరి బంగారం తెచ్చుకుంటాడా లేదా అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories