Tollywood: ఈ హీరోయిన్‌ ఇలా మారిపోయిందేంటి.? షాక్‌ అవ్వాల్సిందే..

Ottesi Cheputunna Movie Fame Actress Kaniha Latest Photos Goes Viral
x

Tollywood: వార్నీ ఈ హీరోయిన్‌ ఇలా మారిపోయిందేంటి.? షాక్‌ అవ్వాల్సిందే..

Highlights

Tollywood: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొనసాగినంత కాలం హీరోయిన్లు ఉండరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Tollywood: సినిమా ఇండస్ట్రీలో హీరోలు కొనసాగినంత కాలం హీరోయిన్లు ఉండరనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని రోజుల పాటు తెరపై తళుక్కుమని తెరమరుగైన ఎందరో హీరోయిన్లు ఉన్నారు. అలాంటి వారిలో కనిహా సుబ్రమణ్యం ఒకరు. శ్రీకాంత్ హీరోగా నటించిన ఒట్టేసి చెబుతున్న సినిమాతో ప్రేక్షులను పలకరించిందీ బ్యూటీ. తొలిసినిమాతోనే తనదైన అందం, అభినయంతో మెస్మరైజ్ చేసింది కనిహా.

ఆ తర్వాత నా ఆటోగ్రాఫ్‌ స్వీట్‌ మెమోరీస్‌ చిత్రంలో చిన్న పాత్రలో నటించింది. ఇక అనంతరం మరో తెలుగు సినిమాలో నటించలేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్తిగా దూరమైన కనిహా.. కెరీర్‌ పీక్స్‌లో ఉన్న సమయంలోనే శ్యామ్ రాధాకృష్ణన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఈ జంటకు ఒక బాబు ఉన్నాడు. అయితే తాజాగా విజయ్‌ నటించిన ది గోట్‌ సినిమాలో కనిపించి మరోసారి ప్రేక్షకులను పలకరించింది.

దీంతో ఈ బ్యూటీ కోసం నెటిజన్లు సోషల్‌ మీడియాలో వెతకడం ప్రారంభించారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ తమిళంలో కొన్ని సీరియల్స్‌లో నటిస్తోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోలతో ప్రేక్షకులను మరోసారి ఫిదా చేస్తోంది. ముఖ్యంగా వెస్ట్రన్‌ డ్రస్‌లో ఈ ఏజ్‌లోనూ స్టన్నింగ్‌ లుక్స్‌తో మెస్మరైజ్‌ చేస్తోంది. కాగా కనిహా.. 2001లో మిస్ చెన్నై అందాల పోటీలో కనికా 2వ రన్నరప్‌గా నిలిచింది. 2002లో సుసి గణేశన్ దర్శకత్వం వహించిన ఫైవ్ స్టార్ చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.


Show Full Article
Print Article
Next Story
More Stories