3,800 పిల్లల గుండెలకు జీవం పోసిన గాయని!

3,800 పిల్లల గుండెలకు జీవం పోసిన గాయని!
x
Highlights

బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ దాతృత్వంలో గిన్నిస్ రికార్డు సాధించారు.

బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ దాతృత్వంలో గిన్నిస్ రికార్డు సాధించారు. 3,800 మంది నిరుపేద పిల్లల గుండె శస్త్రచికిత్సలకు నిధులు సమకూర్చారు. లిమ్కా రికార్డుల్లోనూ ఆమె పేరు నమోదైంది.

పాలక్ పలాష్ చారిటబుల్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన ప్రతి కచేరీ ఆదాయం, వ్యక్తిగత పొదుపును శస్త్రచికిత్సలకు వినియోగిస్తున్నారు. కార్గిల్ అమరవీరుల కుటుంబాలకు సహాయం అందించారు.

గుజరాత్ భూకంప బాధితులకు రూ.10 లక్షల విరాళం ఇచ్చారు. ‘మేరీ ఆశికీ’, ‘కౌన్ తుఝే’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ వంటి హిట్ పాటలతో ఆమె సంగీత రంగంలో గుర్తింపు పొందారు. ఆమె భర్త మిథున్ బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్. ‘ఆషికి 2’, ‘ఏక్ విలన్’, ‘కబీర్ సింగ్’, 'హాఫ్ గర్ల్ ఫ్రెండ్', 'మర్డర్ 2' లాంటి సినిమాలకు చార్ట్‌బస్టర్ పాటలు అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories