Pawan Kalyan Birthday: పవర్ స్టార్ కు సినీ–రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ కు సినీ–రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ
x

Pawan Kalyan Birthday: పవర్ స్టార్ కు సినీ–రాజకీయ ప్రముఖుల శుభాకాంక్షల వెల్లువ

Highlights

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన పవన్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరద కురుస్తోంది.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నేడు జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. రాజకీయ బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, అభిమానుల హృదయాల్లో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని సంపాదించిన పవన్ కు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరద కురుస్తోంది. సినీ ప్రముఖులు, అభిమానులతో పాటు పలువురు రాజకీయ నేతలు కూడా పవన్‌కు విషెస్ తెలుపుతున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ, “చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా సేవలందిస్తున్న కళ్యాణ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు. ప్రజా సేవలో నీ అంకితభావం చిరస్మరణీయం. ప్రజల ఆశీస్సులతో, నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలి” అని ఆకాంక్షించారు.



ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ట్వీట్ చేశారు. “శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఎన్నో హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. సుపరిపాలనకు కట్టుబడి, ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు. ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు.



అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. “మిత్రుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మాటల్లో పదును, చేతల్లో చేవ, సామాజిక స్పృహ, రాజకీయ విలువలకు కట్టుబాటు — ఇవన్నీ కలిసే పవనిజం. అభిమానుల దీవెనలతో మీరు నూరేళ్లు వర్ధిల్లాలి. పాలనలో, రాష్ట్రాభివృద్ధిలో మీ పాత్ర మరువలేనిది” అని అభినందించారు.




సోషల్ మీడియాలో సినీ తారలు, రాజకీయ ప్రముఖులు, అభిమానులు వరుసగా పవన్ కళ్యాణ్‌ను శుభాకాంక్షలతో ముంచెత్తుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories