Pawan Kalyan: విక్రమ్ డైరెక్టర్ తో పవన్ మూవీ సెట్..

Pawan Kalyans Next Movie With Lokesh Kanagaraj
x

Pawan Kalyan: విక్రమ్ డైరెక్టర్ తో పవన్ మూవీ సెట్..

Highlights

Pawan Kalyan: టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే.. పవన్ కల్యాణ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.

Pawan Kalyan: టాలీవుడ్ లో ప్రస్తుతం బిజీగా ఉన్న స్టార్ హీరో ఎవరు అంటే.. పవన్ కల్యాణ్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఓ వైపు రాజకీయాలు మరో వైపు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. ఆయన చేతిలో ప్రస్తుతం బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, OG, హరిహరవీరమల్లు చిత్రాలు ఉన్నాయి. వీటి తర్వాత పవన్ సినిమాలకు కంప్లీట్ బ్రేక్ ఇచ్చి తన ఫుల్ టైమ్ రాజకీయాలపై ఫోకస్ చేస్తారని అంతా అనుకుంటున్నారు. అయితే పవన్ ఊహించని షాక్ ఇస్తున్నారు. తాజాగా మరో కొత్త సినిమాని లైన్ లో పెడుతున్నారు పవర్ స్టార్..

సన్ పిక్చర్స్ సంస్థ తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి మనకు తెలిసిందే. ఈ ప్రొడక్షన్ హౌస్ టాలీవుడ్ లో అడుగుపెట్టనుంది. ఇందులో భాగంగా పవన్ కల్యాణ్ తో సినిమా చేసేందుకు సన్ పిక్చర్స్ సంస్థ యోచిస్తుంది. ఈ క్రమంలోనే OG షూటింగ్ సెట్స్ కు విచ్చేసిన ఆ సంస్థ వైస్ చైర్మన్ పవన్ తో సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. పవన్ తో సినిమా నిర్మించేందుకు ఆసక్తి కనబర్చడంతో ఆయన సైతం అందుకు సానుకూలంగా స్పందించారట.

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రానికి విక్రమ్ ఫేం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించనున్నారట. ప్రస్తుతం ఆయన తమిళ స్టార్ హీరో విజయ్ తో లియో సినిమా చేస్తున్నారు. ఇది పూర్తవ్వగానే రజనీకాంత్ కాంబినేషన్ లో సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఈ రెండు సినిమాలు పూర్తైన తర్వాత పవన్-లోకేశ్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందంటున్నారు. మొత్తానికి, పవన్ గ్యాప్ ఇవ్వకుండా వరుస చిత్రాలకు కమిట్ మెంట్స్ ఇస్తుండడంతో ఆయన అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories