OG Update: 'ఓజీ' ప్రపంచంలోకి 'సత్య దాదా'.. ప్రకాశ్ రాజ్ లుక్ చూశారా?

OG Update: ఓజీ ప్రపంచంలోకి సత్య దాదా.. ప్రకాశ్ రాజ్ లుక్ చూశారా?
x
Highlights

OG Update: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' (OG) చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

OG Update: పవర్‌స్టార్ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' (OG) చిత్రం సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించింది. ఇందులో ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పాత్రను పరిచయం చేస్తూ ఒక పోస్టర్‌ను విడుదల చేసింది.

ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ 'సత్య దాదా' అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. విడుదలైన పోస్టర్‌లో ఆయన సీరియస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ పోస్టర్ ఆధారంగా సినిమాలో ఆయన పాత్ర చాలా కీలకమైనదిగా తెలుస్తోంది.

దర్శకుడు సుజిత్ రూపొందించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్‌లో పవన్ కళ్యాణ్ 'ఓజాస్ గంభీర' అనే గ్యాంగ్‌స్టర్‌గా ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా కనిపించనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories