
Ustaad Bhagat Singh: పవర్ స్టార్ అభిమానులకు గుడ్ న్యూస్.. ఉస్తాద్ ప్రీ పోన్?
Ustaad Bhagat Singh: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది.
Ustaad Bhagat Singh: మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదల తేదీపై నెట్టింట ఆసక్తికర చర్చ సాగుతోంది. మొదటగా ప్రకటించిన తేదీ ప్రకారం ఈ చిత్రం మార్చి 26న విడుదల కావాల్సి ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. వారం రోజుల ముందేనే రిలీజ్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. మార్చి 19న ఉగాది పండుగ సందర్భంగా ఉస్తాద్ సినిమాని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
‘టాక్సిక్’ వాయిదా ‘ఉస్తాద్’కు లాభమా?:
మార్చి 19న విడుదల కావాల్సిన కన్నడ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడిన నేపథ్యంలో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ చర్చకు వచ్చింది. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆ చిత్రాన్ని వాయిదా వేసినట్లు సమాచారం. దీంతో ఆ తేదీ ఖాళీ కావడంతో ‘ఉస్తాద్’ను ముందుకు తీసుకురావాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఉగాది లాంగ్ వీకెండ్‌పై కన్ను:
మార్చి 19న తెలుగు నూతన సంవత్సరం ఉగాది కావడం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి కీలక అంశంగా మారింది. పండుగ సెలవును క్యాష్ చేసుకోవడంతో పాటు లాంగ్ వీకెండ్ కలెక్షన్లు భారీగా వచ్చే అవకాశముందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ విషయంపై మేకర్స్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
భారీ అంచనాలతో వస్తున్న పవన్–హరీష్ కాంబో:
దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇందులో శ్రీలీల, రాశి కన్నాలు కథానాయికలుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ తర్వాత పవన్ కళ్యాణ్–హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, పోస్టర్లు సినిమాపై మంచి హైప్‌ను సృష్టించాయి. విడుదలకు ముందు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఉగాది రోజున ‘ఉస్తాద్ భగత్ సింగ్’ థియేటర్లలోకి వస్తుందా? లేక ముందుగా ప్రకటించిన తేదీనే కొనసాగిస్తారా? అన్నది త్వరలో స్పష్టతకు రానుంది. అభిమానులు అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




