Peddhi: ‘చికిరి చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు – మాస్ బీట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన ప్రోమో!

Peddhi: ‘చికిరి చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు – మాస్ బీట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన ప్రోమో!
x

Peddhi: ‘చికిరి చికిరి’ సాంగ్ రిలీజ్ డేట్ ఖరారు – మాస్ బీట్‌తో ఫ్యాన్స్‌లో జోష్ పెంచిన ప్రోమో!

Highlights

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ ఫిల్మ్ ‘పెద్ది’ నుంచి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది.

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, బాలీవుడ్‌ బ్యూటీ జాన్వీ కపూర్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మోస్ట్‌ అవైటెడ్‌ ఫిల్మ్ ‘పెద్ది’ నుంచి ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫస్ట్‌ సాంగ్‌ అప్‌డేట్‌ వచ్చేసింది. మేకర్స్‌ తాజాగా ఒక బిగ్‌ సర్‌ప్రైజ్‌గా ‘చికిరి’ అంటూ సాగే లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు.

ఈరోజు విడుదల చేసిన ప్రోమో వీడియోలో సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌ ట్యూన్‌, రామ్‌ చరణ్‌ ఎనర్జిటిక్‌ హుక్‌ స్టెప్‌ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. నవంబర్‌ 7న ఈ పాటను గ్రాండ్‌గా రిలీజ్‌ చేయనున్నట్టు టీమ్‌ ప్రకటించింది.

ఆస్కార్‌ విన్నర్‌ ఏ.ఆర్‌. రెహమాన్‌ సంగీతం అందిస్తున్న ఈ పాట గురించి దర్శకుడు బుచ్చిబాబు సానా మాట్లాడుతూ, “పెద్ది (రామ్‌ చరణ్‌) తన గ్రామంలో హీరోయిన్‌ (జాన్వీ కపూర్‌)ను మొదటిసారి చూసే సీన్‌లో ఈ పాట వస్తుంది. హీరో మనసులో కలిగిన భావాలను పదాల్లో వ్యక్తపరిచే ప్రయత్నం చేశాం” అని తెలిపారు.

బుచ్చిబాబు రాసిన “కాటుక అక్కర్లేని కళ్లు, ముక్కుపుడక అక్కర్లేని ముక్కు, అలంకరణ అక్కర్లేని అరుదైన చికిరిరా ఈ చికిరి” అనే లైన్‌ విన్న వెంటనే రెహమాన్‌ ఆ పదంపై ఆసక్తి చూపి “చికిరి అంటే ఏమిటి?” అని అడిగారట. దానికి బుచ్చిబాబు, “మా ఊరిలో అందంగా, ముద్దుగా ఉన్న అమ్మాయిని చికిరి అంటారు” అని చెప్పగా, అదే పదం మీద సాంగ్‌ చేయాలని రెహమాన్‌ నిర్ణయించుకున్నారని చెప్పారు.

ప్రోమో చివర్లో రామ్‌ చరణ్‌ నోట్లో బీడీతో చేసే మాస్‌ హుక్‌ స్టెప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. “ఇదే చరణ్‌ స్టైల్‌!” అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌తో సోషల్‌ మీడియా హీట్‌ పెంచుతున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు సృష్టించగా, తాజా సాంగ్‌ అప్‌డేట్‌ మరింత హైప్‌ క్రియేట్‌ చేస్తోంది.



Show Full Article
Print Article
Next Story
More Stories