పెద్ది vs ది ప్యారడైస్: రిలీజ్ డేట్ ఢీ!

పెద్ది vs ది ప్యారడైస్: రిలీజ్ డేట్ ఢీ!
x

పెద్ది vs ది ప్యారడైస్: రిలీజ్ డేట్ ఢీ!

Highlights

నాని-శ్రీకాంత్ కాంబో ‘ది ప్యారడైస్’ మార్చి 26, 2026న రిలీజ్‌కు సిద్ధమవుతోంది. అదే రోజు రామ్‌చరణ్-బుచ్చిబాబు ‘పెద్ది’ కూడా వస్తోంది. ఈ రెండు సినిమాలపై అంచనాలు మాములుగా లేవు. అయితే రెండు బిగ్ ఫిల్మ్స్ ఢీకొనడం ఖాయమా? లేదా ఒకటి తప్పుకుంటుందా?

దసరా బ్లాక్‌బస్టర్ తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల మరో పాన్-ఇండియా చిత్రం ‘ది ప్యారడైస్’తో సిద్ధమయ్యారు. మార్చి 26, 2026న రిలీజ్ డేట్ ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పెద్ది’ కూడా మొదట మార్చి 27న రిలీజ్ అని ప్రకటించింది.

ఆ తర్వాత షాకింగ్‌గా, ‘పెద్ది’ టీమ్ తమ రిలీజ్‌ను మార్చి 26కు మార్చింది. దీంతో రెండు భారీ చిత్రాలు ఒకే రోజు ఢీకొనే అవకాశం కనిపిస్తోంది. గతంలో OG, అఖండ 2 కూడా ఒకే రిలీజ్ డేట్‌ను టార్గెట్ చేసినప్పుడు, అఖండ 2 వాయిదా పడింది. ఇప్పుడు ‘పెద్ది’ టీమ్ ది ప్యారడైస్ రిలీజ్ వాయిదా పడుతుందని ధీమాగా ఉందనే చర్చ నడుస్తోంది.

రెండు టీమ్‌లు తమ రిలీజ్ డేట్‌పై పట్టుగా ఉన్నాయి. ఈ ఢీలో ఎవరు నిలబడతారు, ఎవరు తప్పుకుంటారో తెలియాలంటే మార్చి 26 వరకు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories