OTT Movie: కూతురితో తండ్రి.. చెల్లిపై ఆ పని చేసే అన్న.. దరిద్రం ఇదేం సినిమారా నాయనా

Pedro Paramo Suspense Movie Streaming on Netflix
x

OTT Movie: కూతురితో తండ్రి.. చెల్లిపై ఆ పని చేసే అన్న.. దరిద్రం ఇదేం సినిమారా నాయనా

Highlights

OTT Movie: ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో రోజుకో కొత్త రకమైన చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది.

OTT Movie: ఓటిటి ప్లాట్‌ఫామ్స్‌లో రోజుకో కొత్త రకమైన చిత్రాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. దీంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం లభిస్తుంది. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి అలాంటి వందల సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఉన్నాయి. ఆత్మల నేపథ్యం ఆధారంగా రూపొందించిన సినిమాలు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందుతున్నాయి. ఈ నేపథ్యంలో 2024లో విడుదలైన ‘పెడ్రో పరామో’ (Pedro Paramo) అనే మెక్సికన్ మ్యాజికల్ మూవీ ఈ వారంలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

1955లో జువాన్ రూల్ఫో రచించిన నవల ఆధారంగా, మాటియో గిల్ స్క్రీన్‌ప్లే రాశారు. అయితే ఈ చిత్రాన్ని రోడ్రిగో ప్రిటో దర్శకత్వం వహించారు. ‘పెడ్రో పరామో’ 49వ టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో 2024 సెప్టెంబర్ 7న వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడింది. ఈ సినిమా కథ ప్రకాష్ అనే వ్యక్తి, బాగా డబ్బున్న దుర్గ అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొడుకు పుట్టిన తర్వాత కొన్ని రోజులలోనే భార్య, కొడుకును ఇంటి నుంచి పంపించి, వేరే ఊరికి వెళ్లిపోతాడు. కొంతకాలం తర్వాత, విక్రమ్, ప్రకాష్ కుమారుడు తన తండ్రి మీద పగ తీర్చుకునేందుకు ఆ ఊరికి వస్తాడు. అయితే ఆ ఊరు, తన తల్లి చెప్పినట్లు పచ్చని పొలాలతో నిండిన, ప్రజలతో కిక్కిరిసిన ఊరుగా ఉండకుండా నిర్మానుష్య, ఎడారి స్థితిలో ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇక్కడ విక్రమ్ ఏం చూస్తాడు అంటే, ఆ ఊరిలో ఉన్న ప్రతిఒక్కరూ ఆత్మలు అని గ్రహిస్తాడు. ఆత్మలు ప్రకాష్ తండ్రి చేసిన అవమానాల గురించి చెబుతాయి.. అన్నా,చెల్లెళ్ల అక్రమ సంబంధం, కూతురు పై తండ్రి అఘాయిత్యం లాంటి ఘటనల కారణంగా ఆ ఊరు వినాశనం కొని తెచ్చుకుంటుంది. ప్రకాష్ ఒక ఉమనైజర్ అని విక్రమ్ తెలుసుకుంటాడు. తన తండ్రి ప్రకాష్ ఆ ఊర్లో మొదట డబ్బు కోసం సుశీల అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత ఆమె అనారోగ్యంతో చనిపోతుంది. ఆ తర్వాతనే దుర్గని పెళ్లాడుతాడు. వాళ్ళని కూడా ఇంట్లో నుంచి తరిమేస్తాడు. పగ తీర్చుకుందాం అని వస్తే, విక్రమ్ కి అక్కడ ఉన్న వాళ్ళంతా దయ్యాలుగా కనిపిస్తారు. అసలు విక్రమ్ తన తండ్రి మీద పగ తీర్చుకోగలాడా? అన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమాలోని ఆత్మల సస్పెన్స్, అన్యాయానికి ఎదుర్కొనే గొప్ప కథతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ సినిమా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories