Vivek Oberoi : రాజ్ కపూర్‎నే మర్చిపోయారు.. షారుఖ్ ఖాన్ ఎంత..వివేక్ ఒబెరాయ్ సంచలన వ్యాఖ్యలు

Vivek Oberoi  : రాజ్ కపూర్‎నే మర్చిపోయారు.. షారుఖ్ ఖాన్ ఎంత..వివేక్ ఒబెరాయ్ సంచలన వ్యాఖ్యలు
x

Vivek Oberoi : రాజ్ కపూర్‎నే మర్చిపోయారు.. షారుఖ్ ఖాన్ ఎంత..వివేక్ ఒబెరాయ్ సంచలన వ్యాఖ్యలు

Highlights

ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన సెలబ్రిటీలలో ఒకరుగా ఉన్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ గురించి నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి.

Vivek Oberoi : ప్రపంచంలోని అత్యంత ధనవంతులైన సెలబ్రిటీలలో ఒకరుగా ఉన్న బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ గురించి నటుడు వివేక్ ఒబెరాయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపాయి. వివిధ కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా అపారమైన ప్రజాదరణ, డిమాండ్ ఉన్నప్పటికీ షారుఖ్ ఖాన్ ఈ కీర్తి అంతా తాత్కాలికమేనని వివేక్ ఒబెరాయ్ అభిప్రాయపడ్డారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 2050 నాటికి షారుఖ్ ఖాన్ ఎవరో కూడా జనాలు మర్చిపోతారు అని వ్యాఖ్యానించారు.

తన వాదనను సమర్థించుకోవడానికి వివేక్ ఒబెరాయ్ సినీ చరిత్ర నుంచి కొన్ని ఉదాహరణలను ఉదహరించారు. 1960లకాలంలో సినిమాల్లో నటించిన కళాకారుల గురించి నేటి తరంలో ఎవరినైనా అడగండి. ఎవరికీ తెలియదు. చరిత్ర నుంచి తప్పక దూరం జరగాల్సి వస్తుందని వివేక్ ఒబెరాయ్ అన్నారు. దీనికి ఉదాహరణగా ఆయన రణబీర్ కపూర్ తాత అయిన రాజ్ కపూర్ పేరును ప్రస్తావించారు. నేటి తరం యువకులు రాజ్ కపూర్ ఎవరు అని అడుగుతున్నారు. మనమంతా ఆయన్ని సినిమా దేవుడు అని పిలిచేవాళ్లం. కానీ నేడు రణబీర్ కపూర్ అభిమానులను అడిగితే రాజ్ కపూర్ ఎవరో కూడా వారికి తెలిసి ఉండదని వివేక్ ఒబెరాయ్ స్పష్టం చేశారు.

ఇదే సూత్రాన్ని షారుఖ్ ఖాన్‌కు వర్తింపజేస్తూ 2050లో షారుఖ్ ఖాన్ ఎవరు అని జనాలు అడగవచ్చు అని వివేక్ ఒబెరాయ్ పేర్కొన్నారు. వివేక్ ఒబెరాయ్ చాలా సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో అనేక అవకాశాలు ఉన్నాయి. నవంబర్ 21న విడుదల కానున్న మస్తీ 4 సినిమాలో ఆయన నటించారు. అంతేకాకుండా ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం స్పిరిట్ లో కూడా వివేక్ ఒబెరాయ్ నటిస్తున్నారు.

మరోవైపు, షారుఖ్ ఖాన్ తన తదుపరి చిత్రం కింగ్ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం టైటిల్ టీజర్ ఆయన 60వ పుట్టినరోజు సందర్భంగా నవంబర్ 2న విడుదలైంది. 60 ఏళ్ల వయస్సులో కూడా షారుఖ్ ఖాన్ భారీ యాక్షన్ సినిమాలను చేస్తుండటం విశేషం. షారుఖ్ ఖాన్ ఆస్తి విలువ సుమారు రూ. 12,490 కోట్లు ఉంటుందని అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories