‘పోలీస్ కంప్లైంట్’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ: వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర కెమిస్ట్రీ అదుర్స్!

‘పోలీస్ కంప్లైంట్’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ: వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర కెమిస్ట్రీ అదుర్స్!
x

‘పోలీస్ కంప్లైంట్’ నుంచి బ్యూటిఫుల్ మెలోడీ: వరలక్ష్మి శరత్ కుమార్ - నవీన్ చంద్ర కెమిస్ట్రీ అదుర్స్!

Highlights

Police Complaint: టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’.

Police Complaint: టాలెంటెడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్, వెర్సటైల్ యాక్టర్ నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా ఒక క్రేజీ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని "ప్రేమ ఓ ప్రేమ" అనే మెలోడియస్ సాంగ్‌ను సీనియర్ జర్నలిస్ట్ ప్రభు ఆవిష్కరించారు.

అన్విక ఆడియోస్ ద్వారా విడుదలైన ఈ పాటకు సుధాకర్ మారియో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఈ పాట యువతకు బాగా నచ్చుతుందని, సూపర్ హిట్ లవ్ సాంగ్స్ జాబితాలో చేరుతుందని దర్శకుడు సంజీవ్ మేగోటి ధీమా వ్యక్తం చేశారు. సినిమా అంతా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా ఉండబోతుందని ఆయన తెలిపారు.

ఈ చిత్రంలో రాగిణి ద్వివేది, ఆదిత్య ఓం, రవిశంకర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, పృథ్వి వంటి దాదాపు 52 మంది సీనియర్ ఆర్టిస్టులు నటిస్తుండటం విశేషం. ఎస్.ఎన్. హరీష్ సినిమాటోగ్రఫీ, డ్రాగన్ ప్రకాష్–రవితేజ అందించిన ఫైట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర పాత్రలు వారి గత చిత్రాలకు భిన్నంగా, సరికొత్తగా ఉంటాయని చిత్ర యూనిట్ పేర్కొంది.ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘పోలీస్ కంప్లైంట్’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్ కలగలిసిన ఈ థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.


Show Full Article
Print Article
Next Story
More Stories