Prabhas Fans: మారుతికి చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇంటికి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ క్యూ..!

Prabhas Fans: మారుతికి చుక్కలు చూపిస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్.. ఇంటికి స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ క్యూ..!
x
Highlights

Prabhas Fans: సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ ఒక్క హిట్ వస్తే నెత్తిన పెట్టుకునే అభిమానులే, ఫ్లాప్ వస్తే పాతాళానికి తొక్కేస్తారు.

Prabhas Fans: సినిమా అంటేనే రంగుల ప్రపంచం.. ఇక్కడ ఒక్క హిట్ వస్తే నెత్తిన పెట్టుకునే అభిమానులే, ఫ్లాప్ వస్తే పాతాళానికి తొక్కేస్తారు. తాజాగా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి దర్శకుడు మారుతికి చుక్కలు కనిపించేలా వింత అనుభవం ఎదురైంది. 'రాజా సాబ్' సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన అభిమానులు, విమర్శల స్థాయిని దాటి ఏకంగా మారుతి ఇంటిపై 'ఫుడ్ అటాక్' చేశారు.

మారుతి కొండాపూర్‌లోని తన లగ్జరీ విల్లాలో ఉండగా, ఒక్కసారిగా స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్ క్యూ కట్టారు. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 100కు పైగా క్యాష్ ఆన్ డెలివరీ ఫుడ్ ఆర్డర్లు మారుతి అడ్రస్‌కు రావడంతో సెక్యూరిటీ సిబ్బంది హతాశులయ్యారు. బిర్యానీలు, పిజ్జాల నుంచి కూల్ డ్రింక్స్ వరకు ఏదీ వదలకుండా ప్రభాస్ ఫ్యాన్స్ ఆర్డర్ల మీద ఆర్డర్లు కుమ్మరించారు. అయితే మారుతి తాను ఎలాంటి ఆర్డర్లు పెట్టలేదని స్పష్టం చేయడంతో ఆ ఫుడ్ డెలివరీ బాయ్స్ అందరూ నిరాశతో వెనుదిరిగారు.

ఈ ఘటన ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. కేవలం మారుతి మాత్రమే కాదు, గతంలోనూ స్టార్ హీరోలతో సినిమాలు చేసి ఫ్లాప్ ఇచ్చిన దర్శకులు అభిమానుల ట్రోలింగ్‌కు, ఇలాంటి వెరైటీ దాడులకు గురయ్యారు. ఒకప్పుడు సోషల్ మీడియాలో నెగిటివ్ పోస్టులకే పరిమితమైన ఫ్యాన్స్, ఇప్పుడు ఏకంగా ఇంటి వరకు వస్తుండటం దర్శకులను భయాందోళనకు గురి చేస్తోంది. పెద్ద హీరోతో సినిమా అంటేనే గడగడలాడాల్సి వస్తోంది అంటూ దర్శకులు వణికిపోతున్నారు. అభిమానం హద్దులు దాటి వికృత చేష్టలకు దారి తీయడం పట్ల ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories