Prabhas : డార్లింగ్ డబుల్ ధమాకా..ఒకే రోజు రెండు బిగ్ అప్‌డేట్స్..ఫ్యాన్స్‌కు పండుగే

Prabhas : డార్లింగ్ డబుల్ ధమాకా..ఒకే రోజు రెండు బిగ్ అప్‌డేట్స్..ఫ్యాన్స్‌కు పండుగే
x

Prabhas : డార్లింగ్ డబుల్ ధమాకా..ఒకే రోజు రెండు బిగ్ అప్‌డేట్స్..ఫ్యాన్స్‌కు పండుగే

Highlights

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది (2024 జూన్‌లో కల్కి 2898 AD విడుదలైంది).

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది (2024 జూన్‌లో కల్కి 2898 AD విడుదలైంది). అప్పటి నుంచి మరో సినిమా లేకపోవడంతో అలాగే ది రాజా సాబ్ సినిమా విడుదల వాయిదా పడుతూ ఉండటంతో డార్లింగ్ అభిమానులు నిరాశలో ఉన్నారు. అయితే నిరాశ చెందిన అభిమానులకు ఒకే రోజు రెండు అదిరిపోయే శుభవార్తలు వచ్చాయి. నవంబర్ 23 ప్రభాస్ రెండు సినిమాల నుంచి బిగ్ అప్‌డేట్స్ విడుదలయ్యాయి.

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా నుంచి రెబల్ సాంగ్ విడుదలైంది. టి-సిరీస్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదలైన ఈ పాట ప్రస్తుతం అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ పాట పూర్తిగా ప్రభాస్‌ను పొగుడుతూ, ఆయనను పాన్ ఇండియా నంబర్ 1, రెబల్ స్టార్ వంటి పదాలతో కీర్తిస్తూ ఉంది. ఈ పాటను ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల కోసమే రూపొందించినట్లుగా ఉంది.

ది రాజా సాబ్ ఒక హారర్-కామెడీ సినిమా. ఇందులో ప్రభాస్ తాత, మనవడి పాత్రల్లో డ్యూయెల్ రోల్ చేశారు. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణం, వీఎఫ్‌ఎక్స్ క్వాలిటీ విషయంలో ప్రభాస్ సంతృప్తి చెందకపోవడమే. అందుకే వీఎఫ్‌ఎక్స్‌ను మళ్లీ చేయిస్తుండటం వల్ల విడుదల ఆలస్యం అవుతోంది. అదే రోజున ప్రభాస్ కొత్త సినిమా స్పిరిట్ ముహూర్తం కూడా జరిగింది. ఈ కార్యక్రమంతో సినిమా షూటింగ్ అధికారికంగా ప్రారంభమైంది.

ఈ ముహూర్తం కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ త్రిప్తి డిమ్రీ , దర్శకుడు సందీప్ రెడ్డి వంగా పాల్గొన్నారు. ప్రభాస్ కూడా ముహూర్త సమయంలో ఉన్నప్పటికీ ఆయన చిత్రాలను మాత్రం మేకర్స్ విడుదల చేయలేదు. ఈ సినిమాకు అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు. భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నారు. వివేక్ ఒబెరాయ్, ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories