Prabhas : కృష్ణంరాజు సలహా కాదని.. కెమెరా ముందే నేర్చుకోమన్నారు..ప్రభాస్ ఫస్ట్ మూవీ వెనుక ఇంత కథ ఉందా ?

Prabhas : కృష్ణంరాజు సలహా కాదని.. కెమెరా ముందే నేర్చుకోమన్నారు..ప్రభాస్ ఫస్ట్ మూవీ వెనుక ఇంత కథ ఉందా ?
x

Prabhas : కృష్ణంరాజు సలహా కాదని.. కెమెరా ముందే నేర్చుకోమన్నారు..ప్రభాస్ ఫస్ట్ మూవీ వెనుక ఇంత కథ ఉందా ?

Highlights

ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు హీరో ప్రభాస్.

Prabhas : ప్రస్తుతం భారతీయ సినిమా రంగంలో పాన్ ఇండియా స్టార్‌గా వెలుగొందుతున్నాడు హీరో ప్రభాస్. బాహుబలి సినిమాల తర్వాత ఆయన క్రేజ్ మామూలుగా లేదు. ఆయన సినిమా విడుదల రోజునే 30-40 కోట్లు వసూలు చేస్తోంది. కనీసం యావరేజ్ టాక్ వచ్చినా 150-200 కోట్లు కలెక్ట్ చేస్తోంది. అయితే, ఈ స్థాయి హీరోకి మొట్టమొదటిసారిగా అవకాశం ఇచ్చిన దర్శకుడు ఎవరో తెలుసా ? అలాగే ప్రభాస్ తన తొలి సినిమాకు తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రభాస్ తొలి సినిమా ఈశ్వర్ . ఈ సినిమాను డైరెక్ట్ చేసింది బెంగళూరుకు చెందిన జయంత్ సి. పరాన్జీ. కాలేజీ రోజుల్లో ఇంగ్లీష్ నాటకాలు డైరెక్ట్ చేయడానికి హైదరాబాద్‌కు షిఫ్ట్ అయిన జయంత్, ఆ తర్వాత తెలుగు సినిమా రంగంలోకి వచ్చి మంచి సినిమాలు తీశారు. మహేష్ బాబుతో కౌబాయ్ తరహా సినిమా టక్కరి దొంగ డైరెక్షన్ చేస్తున్న సమయంలో, నిర్మాత అశోక్ కుమార్ కోరిక మేరకు ఒక యాక్షన్-లవ్ స్టోరీని సిద్ధం చేసుకున్నారు. బడ్జెట్ కారణంగా కొత్త హీరోను తీసుకోవాలని నిర్ణయించారు.

అదే సమయంలో రెబెల్ స్టార్ కృష్ణంరాజు తమ్ముడి కొడుకు ప్రభాస్ నటనలో శిక్షణ తీసుకుంటున్నారని జయంత్‌కు తెలిసింది. ప్రభాస్ ఫోటోలు చూడగానే జయంత్‌కు బాగా నచ్చాయి. ఇతనే తన సినిమా హీరో అని ఫిక్స్ అయ్యారు. అయితే, కృష్ణంరాజు గారు.. "ప్రభాస్ ఇంకా ట్రైనింగ్ పూర్తి చేయలేదు, ఇంకొన్ని నెలలు ఆగండి" అని కోరినా.. జయంత్ వినలేదు. "కెమెరా ముందే నేర్చుకోనివ్వండి" అని చెప్పి, వెంటనే ప్రభాస్‌ను తీసుకువచ్చారు.

ప్రభాస్ హీరోగా నటించిన ఈశ్వర్ సినిమా 2002లో విడుదలైంది. తొలి సినిమాతోనే ప్రభాస్ సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో ఈ సినిమా 3.50 కోట్ల రూపాయల వసూళ్లను సాధించింది. ఈ సినిమా నిర్మాణానికి దాదాపు కోటి రూపాయలు ఖర్చు అయినట్లుగా తెలుస్తోంది. అయితే, తన మొదటి సినిమా ఈశ్వర్ కోసం ప్రభాస్ తీసుకున్న రెమ్యునరేషన్ అక్షరాలా నాలుగు లక్షల రూపాయలు (రూ. 4 లక్షలు) మాత్రమే. అప్పట్లో లక్షల్లో సంపాదించిన ప్రభాస్, ఇప్పుడు ఒక్కో సినిమాకు వందల కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారంటే.. ఆయన ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories