Prabhas: ప్రభాస్‌-హను మూవీ లేటెస్ట్ అప్‌డేట్‌.. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా?

Prabhas hanu raghavapudi movie first schedule will starts from next monday in tamil nadu
x

Prabhas: ప్రభాస్‌-హను మూవీ లేటెస్ట్ అప్‌డేట్‌.. ఫస్ట్ షెడ్యూల్ ఎక్కడో తెలుసా? 

Highlights

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ వచ్చే సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కారైకుడిలో షూటింగ్‌ మొదలు కానుందని సమాచారం.

కల్కి 2898తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్‌ తాజాగా హనురాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే చిత్ర యూనిట్ ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది. పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ను ఖరారు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఇమాన్వీ అనే కొత్త హీరోయిన్‌ వెండి తెరకు పరిచయమవుతోంది. ఇంకా సినిమా షూటింగ్ కూడా మొదలుకాకుండానే ఈ బ్యూటీకి క్రేజ్‌ విపరీతంగా పెరిగిపోయింది.

ఇక సీతారామమ్‌ వంటి బ్లాక్‌ బ్లస్టర్‌ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో వహిస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. యుద్ధం నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్లాన్‌ చేస్తున్నారు మేకర్స్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లోని భాషల్లో కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన న్యూస్‌ బయటకు వచ్చింది.

ఈ సినిమా తొలి షెడ్యూల్‌ వచ్చే సోమవారం నుంచి ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని కారైకుడిలో షూటింగ్‌ మొదలు కానుందని సమాచారం. కీలక సన్నివేశాలను తమిళనాడులోని కారైకుడి ప్యాలెస్‌లో చిత్రీకరించబోతున్నారని టాక్‌. ఈ షెడ్యూల్‌ మొత్తం ప్రభాస్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటాయని తెలుస్తోంది. ఇక ఇది పూర్తికాగానే హైదరాబాద్‌లో సెకండ్ షెడ్యూల్ ఉండనుందని సమాచారం. ఇందుకోసం చిత్ర యూనిట్ భారీ బడ్జెట్‌తో ప్రత్యేక సెట్ కూడా వేస్తోందని తెలుస్తోంది. వీటికి సంబంధించిన అన్ని వివరాలను చిత్ర యూనిట్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను రెండో ప్రపంచ యుద్ధానికి ముందు జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌ ప్రస్తుతం రాజాసాబ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కల్కి 2898 ఏడీ సీక్వెల్​, స్పిరిట్ ప్రాజెక్టులు కూడా క్యూలో ఉన్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories