The Raja Saab: 'ది రాజా సాబ్‌' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్ ఫిక్స్, యూఎస్‌లో మెగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌!

The Raja Saab: ది రాజా సాబ్‌ వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్ ఫిక్స్, యూఎస్‌లో మెగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌!
x

The Raja Saab: 'ది రాజా సాబ్‌' వాయిదా వార్తలకు చెక్.. రిలీజ్ డేట్ ఫిక్స్, యూఎస్‌లో మెగా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌!

Highlights

The Raja Saab: ప్రభాస్ (Prabhas) హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్‌' (The Raja Saab) చిత్రం వాయిదా పడుతుందనే వార్తలపై నిర్మాణ సంస్థ తాజాగా స్పష్టత ఇచ్చింది.

The Raja Saab: ప్రభాస్ (Prabhas) హీరోగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజా సాబ్‌' (The Raja Saab) చిత్రం వాయిదా పడుతుందనే వార్తలపై నిర్మాణ సంస్థ తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ సినిమాను ముందుగా ప్రకటించిన విధంగా జనవరి 9న అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు.

ప్రస్తుతం 'ది రాజా సాబ్‌' చిత్రానికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ (VFX) మరియు ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ సంస్థ విడుదల చేసిన నోట్ ప్రకారం.. జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫార్మాట్‌లలో, ఐమాక్స్ వెర్షన్‌తో సహా, ఒకేసారి విడుదల కానుంది. డిసెంబర్‌లో అమెరికాలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. డిసెంబర్ 25లోపు అన్ని పనులు పూర్తి చేసి, సినిమా ఫస్ట్ కాపీని సిద్ధం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ సంక్రాంతికి థియేటర్‌లలో 'రాజా సాబ్‌' సందడిని రెట్టింపు చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నిర్మాత విశ్వప్రసాద్ ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దర్శకుడు మారుతి రెట్టింపు శ్రద్ధతో సినిమాను తీర్చిదిద్దుతున్నారని నిర్మాణ సంస్థ పేర్కొంది.

మారుతి – ప్రభాస్ కాంబోలో వస్తున్న తొలి చిత్రమిది. హారర్ కామెడీ నేపథ్యంలో ముస్తాబవుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, మరియు రిద్ది కుమార్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. మొదట్లో డిసెంబర్‌లో విడుదల చేయాలని భావించినప్పటికీ, డేట్ కుదరకపోవడంతో జనవరి 9కి వాయిదా పడిన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories