Prabhas ‘The Raja Saab’ Teaser Leak: లీకైన టీజర్‌పై ప్రభాస్ టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు!

Prabhas ‘The Raja Saab’ Teaser Leak: లీకైన టీజర్‌పై ప్రభాస్ టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు!
x

Prabhas ‘The Raja Saab’ Teaser Leak: లీకైన టీజర్‌పై ప్రభాస్ టీమ్ వార్నింగ్.. షేర్ చేస్తే కఠిన చర్యలు!

Highlights

ప్రభాస్ ‘ది రాజాసాబ్‌’ టీజర్ లీక్ అయ్యింది. లీక్ వీడియోలు షేర్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ చిత్రబృందం వార్నింగ్ ఇచ్చింది. టీజర్ రిలీజ్ డేట్, ఈవెంట్ డీటెయిల్స్ ఇవే.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ (Prabhas) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్‌ (The Raja Saab)’ ఇప్పటికే భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. జూన్ 16న టీజర్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో... టీజర్‌కు సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట లీక్‌ కావడంతో చిత్రబృందం సీరియస్‌గా స్పందించింది.

🚫 ‘రాజాసాబ్’ లీక్ కంటెంట్‌ షేర్ చేస్తే కఠిన చర్యలు: టీమ్ హెచ్చరిక

మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ టీజర్ వీడియోలు సోషల్ మీడియాలో లీకవుతుండటంతో చిత్ర బృందం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

"ఎవరైనా లీకైన వీడియోలు, ఫొటోలు షేర్ చేస్తే వారి సోషల్ మీడియా అకౌంట్స్‌ను బ్లాక్ చేయడమే కాదు, లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం" అని వార్నింగ్ ఇచ్చింది.

"మేము ప్రేక్షకులకు పూర్తి స్థాయి సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఎంతో శ్రమిస్తున్నాం. అందుకే ఫ్యాన్స్ అందరూ సహకరించాలి" అని కోరింది.

🎬 ‘The Raja Saab’ టీజర్ రిలీజ్ డేట్, గ్రాండ్ ఈవెంట్ డీటైల్స్

ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి హారర్ బ్యాక్‌డ్రాప్‌ లో నటిస్తున్న సినిమా ఇదే కావడంతో ఫ్యాన్స్‌లో భారీ ఎగ్జైట్మెంట్ ఉంది.

✅ టీజర్ రిలీజ్ తేదీ: జూన్ 16, 2025

✅ సినిమా రిలీజ్: డిసెంబర్ 5, 2025 (ప్రపంచవ్యాప్తంగా)

ఈ టీజర్ విడుదల కోసం చిత్ర బృందం ఒక విశిష్టమైన ఈవెంట్ ప్లాన్ చేస్తోంది. జాతీయ మీడియా ప్రతినిధులకు కూడా ఆహ్వానాలు పంపినట్లు సమాచారం. ఈ ఈవెంట్‌లో చిత్రానికి ప్రత్యేకంగా నిర్మించిన భారీ సెట్‌ను ప్రదర్శించనున్నట్లు టాక్.

Show Full Article
Print Article
Next Story
More Stories