Prodduturu Dussehra : ఓటీటీలోకి ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ.. 40 నిమిషాల దసరా వైభవం ఎక్కడ చూడాలంటే?

Prodduturu Dussehra : ఓటీటీలోకి ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ.. 40 నిమిషాల దసరా వైభవం ఎక్కడ చూడాలంటే?
x
Highlights

Prodduturu Dussehra : తెలుగు సంస్కృతి, పండుగల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ఇటీవల కాలంలో మేకర్స్ డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందిస్తున్నారు.

Prodduturu Dussehra: తెలుగు సంస్కృతి, పండుగల ప్రత్యేకతను ప్రపంచానికి చాటిచెప్పే ఉద్దేశంతో ఇటీవల కాలంలో మేకర్స్ డాక్యుమెంటరీ చిత్రాలను రూపొందిస్తున్నారు. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రొద్దుటూరులో ఘనంగా జరిగే దసరా ఉత్సవాల అద్భుతమైన వైభవాన్ని, సంస్కృతిని, వైవిధ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన 40 నిమిషాల డాక్యుమెంటరీ చిత్రం ప్రొద్దుటూరు దసరా. తాజాగా ఓటీటీలోకి అడుగుపెట్టింది. అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై ప్రశంసలు అందుకున్న ఈ డాక్యుమెంటరీ ఓటీటీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేందుకు ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఈటీవీ విన్ లో అందుబాటులోకి వచ్చింది.

తెలుగు ప్రజల సంస్కృతి, పండుగలు, వైవిధ్యాన్ని పరిచయం చేయాలనే లక్ష్యంతో ప్రస్తుతం తెలుగులో డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం పెరుగుతోంది. ఇటీవల, ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలో ఉన్న ప్రొద్దుటూరు ప్రాంతంలో అత్యంత ఘనంగా నిర్వహించే దసరా ఉత్సవాలపై రూపొందించిన డాక్యుమెంటరీ ఓటీటీ ప్రేక్షకులను పలకరించింది. తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగను కన్నుల పండువగా జరుపుతారు. అయితే, కళ, భక్తితో నిండిన ప్రొద్దుటూరు దసరా ఉత్సవాలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌పై ప్రేమ్ కుమార్ వాలపాలా నిర్మించిన ఈ డాక్యుమెంటరీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం అథారిటీ కూడా భాగస్వామ్యమైంది.

ప్రొద్దుటూరు దసరా ఉత్సవాల వైభవాన్ని ఎక్కువ మందికి పరిచయం చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ దీనిని రూపొందించారు. కేవలం 40 నిమిషాల నిడివి గల ఈ డాక్యుమెంటరీ, దసరా ఉత్సవాల వైభవాన్ని, ప్రజల సంప్రదాయాలను, సంస్కృతిని చూపిస్తూ అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో మంచి స్పందన లభించడంతో, ఈ డాక్యుమెంటరీని ఓటీటీ ప్రేక్షకులకు చేరువ చేయడానికి మేకర్స్ డిజిటల్ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చారు.

ప్రొద్దుటూరు దసరా డాక్యుమెంటరీ ప్రముఖ తెలుగు డిజిటల్ స్ట్రీమింగ్ వేదిక అయిన ఈటీవీ విన్ లో విడుదలైంది. ఇది నవంబర్ 7 నుంచే ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ డాక్యుమెంటరీని హై టెక్నికల్ క్వాలిటీతో, అందమైన విజువల్స్‌తో చిత్రీకరించారు. దసరా వైభవం గురించి వ్యక్తులు మాట్లాడిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ప్రస్తుతం బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్ నుంచి మరిన్ని డాక్యుమెంటరీలు, సినిమాలు రాబోతున్నాయని మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీకి స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ చేస్తుండగా, కిలారి సుబ్బారావు పీఆర్ఓగా వ్యవహరిస్తున్నారు. ఎక్కువ మంది ప్రేక్షకులకు ఈ సంస్కృతిని చేరువ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories